ప్రతి ఏటా సంక్రాంతికి పెద్ద సినిమాల జాతర, భారీ బడ్జెట్ మూవీస్ హంగామా ఉండేది. సంక్రాంతి టైం లో చిన్న సినిమాలు రిలీజ్ కి భయపడేలా బాక్సాఫీస్ దగ్గర స్టార్ హీరోలు పోటీ పడేవారు. కానీ ఈసారి కరోనా పెద్ద సినిమాలని భయపెట్టింది. గత ఏడాది రవితేజ క్రాక్, తమిళ స్టార్ హీరో విజయ్ మాస్టర్ లాంటి పెద్ద సినిమాలు రిలీజ్ అయినా.. ఈసారి ఆర్.ఆర్.ఆర్, రాధేశ్యామ్ మూవీస్ కరోనా కారణంగా వాయిదా పడ్డాయి. దానితో లో బడ్జెట్ మూవీస్ నాగార్జున బంగార్రాజు, దిల్ రాజు వారసుడు రౌడీ బాయ్స్, మహేష్ బాబు ఇంటి నుండి గల్లా అశోక్ హీరోలు ఈసారి సంక్రాంతికి పోటీ పడ్డాయి. అందులో నాగార్జున బంగార్రాజు కి మిక్స్డ్ టాక్ రాగా.. రౌడీ బాయ్స్ కి సోసో టాక్ వచ్చింది.
ఇక మహేష్ మేనల్లుడు గల్లా అశోక్ హీరోకి మంచి టాక్ పడింది. అయితే గల్లా అశోక్ కొత్త హీరో కావడంతో.. ఆ సినిమాకి పాజిటివ్ టాక్ పడినా.. మిక్స్డ్ టాక్ వచ్చిన నాగార్జున బంగార్రాజు ఈ సంక్రాంతి విన్నర్ గా స్ట్రాంగ్ కలెక్షన్స్ కొల్లగొడుతుంది. నాగార్జున - నాగ చైతన్య కాంబినేషన్ లో, ఫ్యామిలీ ఎంటర్టైనెర్ గా, అలాగే గ్రామీణ నేపథ్యం లో తెరకెక్కిన బంగార్రాజు కి ప్రేక్షకులు ఓటేశారు. యావరేజ్ టాక్ తోనే బంగార్రాజు కి అదిరిపోయే కలెక్షన్స్ రావడంతో.. ఈ సంక్రాంతి పండగ సీజన్ ని బంగార్రాజు పర్ఫెక్ట్ గా క్యాష్ చేసుకుంది. ఫ్యామిలీ ఆడియన్స్ ఓటు బంగార్రాజుకే పడడంతో.. ఈ 2022 సంక్రాంతి విన్నర్ గా బంగార్రాజు నిలిచింది.