Advertisement
Google Ads BL

తమిళ్ బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్


నార్త్ లో బిగ్ బాస్ రియాలిటీ షో కి విపరీతమైన క్రేజ్, ఆదరణ ఉంది.. కాబట్టే అక్కడ 15 సీజన్స్ ని సక్సెస్ ఫుల్ గా నడిచాయి. సల్మాన్ హోస్ట్ గా హిందీ బిగ్ బాస్ ఇప్పుడు ఓటిటిలోనూ అదరగొట్టేస్తుంది. ఇక నార్త్ లో ఉన్నంత క్రేజ్ సౌత్ బిగ్ బాస్ కి లేకపోయినా.. ఇక్కడ బుల్లితెర ప్రేక్షకులు కూడా బిగ్ బాస్ ని బాగానే ఆదరిస్తున్నారు. తమిళంలో కమల్ హాసన్ హోస్ట్ గా బిగ్ బాస్ సీజన్స్ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంటే.. తెలుగులో ఎన్టీఆర్, నాని, నాగార్జున లతో బిగ్ బాస్ సీజన్స్ నడుస్తున్నాయి. తెలుగులో సీజన్ 5 విన్నర్ గా విజె సన్నీ నిలిచిన విషయం తెలిసిందే.

Advertisement
CJ Advs

అయితే తాజాగా తమిళ బిగ్ బాస్ సీజన్ 5 గత రాత్రి ఆదివారం తో ముగిసింది. ఆదివారం సాయంత్రం కమల్ హోస్ట్ గ బిగ్ బాస్ తమిళ సీజన్ 5 అంగరంగ వైభవంగా ముగిసింది. బిగ్ బాస్ తమిళ ఐదో సీజన్‌ గ్రాండ్ ఫినాలేకు ఐదుగురు కంటెస్టెంట్స్ వచ్చారు. అందులో మొదటి నుంచి తనదైన స్టాండప్‌ కామెడీతో ప్రేక్షకులను అలరించిన రాజు జయమోహన్ విజేతగా నిలిచాడు. బిగ్ బాస్ టైటిల్‌తో పాటు 50 లక్షలు ప్రైజ్‌మనీ అందింది. ఇక తమిళ సీజన్ 5 లో ప్రముఖ యాంకర్ ప్రియాంక దేశ్‌పాండే ఈ సీజన్‌లో రన్నరప్‌గా నిలిచింది. తమిళ బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్ రాజు జయమోహన్ కమల్ చేతుల మీదుగా ట్రోపి అందుకున్నాడు.

Bigg Boss Tamil Season 5 Winner:

Bigg Boss Tamil 5 winner: Raju Jeyamohan lifts the trophy and wins a prize money of Rs. 50 lakhs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs