జబర్దస్త్ లో వన్ అఫ్ ద టీం లీడర్ గా ఉన్న ముక్కు అవినాష్ స్టార్ మా లో ప్రసారమైన రియాలిటీ షో లో కి వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చాడు. బిగ్ బాస్ లో ఉన్నప్పుడు తానింక జబర్దస్త్ లోకి వెళ్ళలేను అని, తాను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మల్లెమాల పట్టించుకోకపోవడం వలన తాను బిగ్ బాస్ లోకి వచ్చా అని, జబర్దస్త్ నుండి బయటికి వస్తూ పది లక్షల ఫైన్ కట్టా అంటూ సంచలనంగా మాట్లాడిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ముక్కు అవినాష్ కి మల్లెమాలపై చాలా కోపంగా ఉన్నట్టుగా ఉంది. ఎదుకంటే గత ఏడాది బిగ్ బాస్ లోకి వెళ్లిన వారు స్టార్ మా కి ఇచ్చిన వన్ ఇయర్ కాంట్రాక్టు పూర్తి కాగానే.. పక్క ఛానల్స్ లోకి వెళుతున్నారు. యాంకర్ లాస్య దగ్గర నుండి, రోహిణి ఇలా చాలామంది ఈటీవీలో ప్రసారమవుతున్న స్పెషల్ ఫెస్టివ్ ప్రోగ్రాంలో సందడి చేస్తున్నారు.
అవినాష్ కూడా స్టార్ మా వన్ ఇయర్ కాంట్రాక్టు పూర్తయినా ఈటీవీలో ఎక్కడా కనిపించడం లేదు. తనకి కొత్తగా పెళ్ళై, తన భార్య తో ఇంకా ఇంకా స్టార్ మా ప్రోగ్రామ్స్ లోనే కనిపిస్తున్నాడు కానీ, అవినాష్ ఈటీవీలో కనిపించింది లేదు. ఇక అవినాష్ చెప్పినట్టుగా జబర్దస్త్ కి ఎంట్రీ లేకపోయినా, కనీసం ఫెస్టివ్ ప్రోగ్రామ్స్ లోకి రావడం లేదు. అంటే అవినాష్ కి మల్లెమాల పై కోపం పోలేదా? లేదంటే నిజంగానే అవినాష్ కి ఈటీవిలోకి ఎంట్రీ లేకుండా మల్లెమాల చేసిందా? అనేది ఇప్పుడు అందరిలో మొదలైన అనుమానం.