సాయి ధరమ్ తేజ్ ఈమధ్య మెగా కుటుంబంతో ఫొటోస్ లో అందరితో పాటు కనపడుతున్నాడు. గత సంవత్సరం సెప్టెంబర్ రెండవ వారంలో సాయి ధరమ్ తేజ్ బైక్ ఆక్సిడెంట్ లో గాయపడిన సంగతి తెలిసిందే. చాలా రోజులు హాస్పిటల్ లో వుండి ఆ తరువాత ఇంటికి వచ్చిన సాయి ధరమ్ తేజ్ పూర్తిగా కోలుకున్నట్లేనా? విచిత్రం ఏంటి అంటే మెగా కుటుంబంలో అతని ఫొటోస్ అయితే పెడుతున్నారు కానీ, ఇంతవరకు సాయి తేజ్ ఎక్కడ మాట్లాడిన దాఖలాలు లేవు. అంటే ఆ ఆక్సిడెంట్ అయినా తరువాత సాయి తేజ్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మధ్యలో ఒకటి రెండు సార్లు సోషల్ మీడియా లో ఏవో మెసేజెస్ మాత్రం పెట్టాడు. కానీ మాట్లాడటం మాత్రం లేదు.
అయితే సన్నిహితులు తెలిసిన ఎక్సక్లూసివ్ సమాచారం ప్రకారం, సాయి తేజ్ కి ఆక్సిడెంట్ అయిన తరువాత అతను ఒకరకమయిన షాక్ కి గురి అయ్యాడని తెలిసింది. ఆ షాక్ వాళ్ళ అతని మాట (వోకల్) పడిపోయింది అని సమాచారం. అందువల్లనే సాయి తేజ్ బయటకి మామూలుగా కనపడిన మాట ఇంకా రాలేదని, చెప్తున్నారు. మొన్న చిరంజీవి గారు దోసెలు వేసినప్పుడు కూడా సాయి తేజ్ నిలబడ్డాడు కానీ అతని మాటలు ఏమి బయటకి రాలేదు ఇంత వరకు. అస్సలు ఆక్సిడెంట్ అయిన దగ్గర నుంచి ఇంతవరకు సాయి తేజ్ మాట ఒక్కటి కూడా రాలేదు. ఏమైనా ఉంటే సోషల్ మీడియా లో ఒక మెసేజ్ రూపంలో పెడుతున్నాడు అంతే. అయితే ఈ మాట తడబడటం కూడా పెద్ద సీరియస్ కాదు అంటున్నారు. అది కూడా త్వరలో వచ్చేస్తుంది, అతను వోకల్ తిరిగి మామూలుగా అవ్వటానికి డాక్టర్స్ వర్క్ చేస్తున్నట్టుగా కూడా తెలిసింది. అతని చుట్టూ పక్కల వున్నవాళ్లు ఈ విషయాన్నీ కవర్ చేస్తూ, సాయి తేజ్ ని ఫొటోస్ లో చూపిస్తూ కోలుకున్నాడు అనే విషయాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. అతనికి కూడా మిగతా ఎటువంటి అవరోధాలు లేవు, ఒక్క మాట తప్ప అది కూడా వచ్చేస్తే, ఇంకా షూటింగ్స్ కూడా స్టార్ట్ చేస్తాడు అని అంటున్నారు.