Advertisement
Google Ads BL

షణ్ముఖ్ - దీప్తి బ్రేకప్ పై సిరి స్పందన


బిగ్ బాస్ సీజన్ 5 లో  సిరి - షణ్ముఖ్ స్నేహాన్ని చూసిన షణ్ముఖ్ గర్ల్ ఫ్రెండ్, లవర్ దీప్తి సునయన షణ్ముఖ్ కి బ్రేకప్ చెప్పేసింది. దానితో సిరి ఫ్రెండ్ షిప్ వలనే షణ్ముఖ్ తన గర్ల్ ఫ్రెండ్ కి దూరమయ్యాడంటూ సిరి ని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. అటు సిరి రిలేషన్ షిప్ కూడా బీటలు వారింది అని, షణ్ముఖ్ - సిరి బిగ్ బాస్ హౌస్ లో హగ్గులు, ముద్దులు అంటూ చేసిన రచ్చ చాలామందికి నచ్చలేదు. అయితే ఈ విషయమై సిరి, షణ్ముఖ్ లు చాలాసార్లు వివరణ ఇచ్చారు మేము ఇద్దరం ఫ్రెండ్స్ మాత్రమే, మా మధ్యన ఎమోషనల్ బాండింగ్ మాత్రమే ఉంది అన్నారు. అయితే షణ్ముఖ్ - దీప్తి విడిపోయాక సిరి తన ఇన్స్టా ఖాతాలో నువ్వు బలంగా ఉండు అంటూ షణ్ముఖ్ ని సమర్థిస్తూ పోస్ట్ లు పెట్టింది కానీ డైరెక్ట్ గా వాళ్ళ బ్రేకప్ పై స్పందించలేదు.

Advertisement
CJ Advs

అయితే సిరి ఈ సంక్రాంతికి హైదరాబాద్ నుండి తన నేటివ్ ప్లేస్ వైజాగ్ వెళ్ళింది. అక్కడ తన ఇంటి వద్ద సిరికి ఘన స్వాగతం లభించింది. ఆ తర్వాత సిరి ని మీడియా ప్రశ్నించింది. తనపై ఇంత అభిమానం చూపిస్తున్న అభిమానులకి థాంక్స్ చెప్పిన సిరి.. షణ్ముఖ్ - దీప్తి బ్రేకపై తొలిసారి స్పందించింది. బిగ్ బాస్ హౌస్ లో 19 మంది ఒకే ఇంట్లో ఉన్నామని, అక్కడ అందరిలో ఎమోషనల్ బాండింగ్ ఉంది అని, అయితే తాను షణ్ముఖ్ ఆ ఎమోషనల్ బాండింగ్ లో ఇంకాస్త ముందుకు వెళ్లామని అంతేకాని.. తమ మధ్యన ఫ్రెండ్ షిప్ మాత్రమే ఉందిగాని, మరెలాంటి ఉద్దేశ్యం లేదు అని, షణ్ముఖ్ - దీప్తి విడిపోవడానికి తాను కారణం కాదని ఖరా ఖండిగా  చెప్పేసింది.

Siri First Reaction After Shanmukh-Deepthi Breakup:

Siri Hanmanth Reacts On Shanmukh- Deepti Sunaina Break Up
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs