మెగా స్టార్ చిరంజీవి దర్శకుడు బాబీ (కె ఎస్ రవీంద్ర) తో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దానికి వాల్తేర్ వీరయ్య అనే టైటిల్ కూడా అనుకుంటున్నట్టుగా తెలిసింది. ఈ సినిమా ప్రత్యేకత ఏంటి అంటే ఇందులో మాస్ మహారాజ రవి తేజ కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు. ఇంతకీ రవితేజ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా ఈ సినిమాకి? రోజుకి 25 లక్షలు తీసుకుంటున్నదని భోగట్టా.
మీరు విన్నది నిజమే, రవి తేజ రెమ్యూనరేషన్ రోజుకి అంతే అడిగాడు, ఎన్ని రోజులు షూటింగ్ చేస్తే అన్ని రోజులు ఇచ్చేయ్యాల్సిందే. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాకి నిర్మాతలు. బాబీ దర్శకుడు. ప్రస్తుతం చిరంజీవి ఆచార్య, తరువాత లూసిఫెర్ రీమేక్, తరువాత భోళా శంకర్, అలాగే ఈ బాబీ సినిమా కూడా అన్నీ లైన్ లో వున్నాయి. అన్నయ్య సినిమా తరువాత రవి తేజ చిరంజీవి కలిసి నటించండం ఇదే.