మెగాస్టార్ చిరంజీవి రీసెంట్ గా ఏపీ సీఎం జగన్ తో భేటీ అయ్యి.. జగన్ తో కలిసి లంచ్ చేసారు. జగన్ తో చిరు భేటీ అయ్యి సినిమా ఇండస్ట్రీ సమస్యలపై చర్చించారు. అదే విషయాన్ని మెగాస్టార్ జగన్ తో భేటీ తర్వాత మీడియా తో మట్లాడుతూ.. జగన్ సినిమా ఇండస్ట్రీ సమస్యలపై సానుకూలంగా స్పందించారని, ఇండస్ట్రీలో అందరి పక్షాన పని చేస్తానని జగన్ హామీ ఇచ్చారని చెప్పారు. ఆ భేటీ తర్వాత జగన్ తో కలిసి లంచ్ చేసారు. అయితే చిరు - జగన్ భేటీ జరిగింది ఇండస్ట్రీ సమస్యల పరిష్కారంతో పాటుగా.. రాజకీయ కోణంలో ఈ మీటింగ్ జరిగింది అంటూ ప్రచారం మొదలయ్యింది.
కొంతమంది మీడియా వారు.. మీరు నిన్న జగన్ తో మీటింగ్ పెట్టింది.. వైసిపి తరుపున మీకు రాజ్యసభ సీటు ఆఫర్ చెయ్యడానికే అంట కదా అని డైరెక్ట్ గా చిరు నే అడగగా.. దానికి చిరు నవ్వుతూ.. రాజకీయాలకు దూరంగా ఉంటున్న నేను మళ్ళీ రాజకీయాల్లోకి , చట్ట సభలకు రావడం జరగదు. దయ చేసి ఇలాంటి రూమర్స్ ని, ఊహాగానాలు వార్తలుగా ప్రసారం చేయవద్దు. ఇలాంటి వార్తలకు ఇప్పటితో పుల్ స్టాప్ పెట్టమని కోరుతున్నానని ఆయన మీడియా కి చెప్పారు.