Advertisement
Google Ads BL

సినీజోష్ రివ్యూ: బంగార్రాజు


సినీజోష్ రివ్యూ: బంగార్రాజు

Advertisement
CJ Advs

బ్యానర్: అన్నపూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్

నటీనటులు: నాగార్జున, నాగ చైతన్య, కృతి శెట్టి, రమ్యకృష్ణ, రావు రమేష్, వెన్నెల కిషోర్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్: అనూప్ రూబెన్స్

సినిమాటోగ్రఫీ: యువరాజ్

నిర్మాతలు: నాగార్జున అక్కినేని

దర్శకుడు: కళ్యాణ్ కృష్ణ

కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నాగార్జున డ్యూయెల్ రోల్ చేసిన సోగ్గాడే చిన్ని నాయన మూవీ మూడేళ్ళ క్రితం సంక్రాంతి కి రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యింది. దానిలోని బంగార్రాజు కేరెక్టర్ నాగార్జున ఈ సంక్రాంతికి కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలోనే బంగార్రాజు మూవీ ని కొడుకు నాగ చైతన్య తో కలిసి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. సోగ్గాడుగా నాగార్జున పంచె కట్టు, నాగ చైతన్య చిన బంగార్రాజుగా ఎనేర్జిటిక్ కేరెక్టర్ లో కనిపించడం, కృతి శెట్టి పల్లెటూరి అమ్మాయి గెటప్, అనూప్ మ్యూజిక్, కళ్యాణ్ కృష్ణ మేకింగ్ స్టయిల్ అన్ని బంగార్రాజు మీద అంచాలు క్రియేట్ చెయ్యడం, బంగార్రాజు ప్రమోషన్స్ తో నాగార్జున సినిమా మీద స్పెషల్ ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యేలా చేసారు. ఈ సంక్రాంతి కి కుటుంభ కథా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన బంగార్రాజు ప్రేక్షకులని ఎంతవరకు మెప్పించిందో సమీక్షలో తెలుసుకుందాం.

కథ:

సోగ్గాడే చిన్న నాయన సినిమాలో ఆత్మ రూపమ్ లో ఉన్న నాగార్జున, తనకొడుకు నాగార్జున అతని వైఫ్ సీత తో సంతోషంగా ఉండడంతో.. ఆత్మ నాగార్జున హ్యాపీ ఫీలవడంతో ముగుస్తుంది. బంగార్రాజు కథ అక్కడి నుండి స్టార్ట్ అయ్యింది. ఆత్మ నాగార్జున ఈసారి తన మనవడు చిన బంగార్రాజు (నాగ చైతన్య) కోసం మళ్ళి భూలోకానికి రావడంతో కథ మొదలవుతుంది. చిన బంగార్రాజు కోసం ఆత్మ గా ఉన్న పెద్ద బంగార్రాజు(నాగార్జున) తన భార్య సత్యభామ(రమ్యకృష్ణ) తో కలిసి చిన బంగార్రాజు ని - నాగలక్ష్మి(కృతి శెట్టి) లని పేద బంగార్రాజు ఎలా కలిపాడో అనేది సినిమా.

పెరఫార్మెన్స్:

పెద్ద బంగార్రాజు, చిన్న బంగార్రాజు గా నాగార్జున, నాగ చైతన్య లుక్స్ తోనే అద్భుతం చేసి చూపించారు. ఆత్మగా నాగార్జున మనవడు నాగ చైతన్య లోకి దూరి అల్లరి చెయ్యడం, నాగ చైతన్య , నాగార్జున సోగ్గాళ్లుగా అదరగొట్టెయ్యడం సినిమాకి హైలెట్. నాగ చైతన్య కన్నా నాగార్జునే ఆత్మగా ఎక్కువగా హైలెట్ అయ్యాడు. ఇక సత్య భామగా రమ్యకృష్ణ ఆకట్టుకోగా, నాగ లక్ష్మి గా కృతి శెట్టి పల్లెటూరి అమ్మాయిగా స్పెషల్ గా కనిపించింది. యముడిగా నాగ బాబు, సంపత్, వెన్నెల కిషోర్ మిగతా నటులు పరిధిమేర ఆకట్టుకున్నారు.

విశ్లేషణ:

పల్లెటూరి బ్యాగ్డ్రాప్ లో.. కళ్యాణ్ కృష్ణ - నాగార్జున సోగ్గాడే చిన్నినాయనా.. అంటూ కుటుంభ చిత్రంగా ప్రేక్షకులను మెప్పించడంతో.. సోగ్గాడు చిత్రానికి కంటిన్యూ చేస్తూ టెంపుల్ కి బంగార్రాజు కుటుంబానికి కథని ముడిపెట్టిన కళ్యాణ్ కృష్ణ మరోసారి మ్యాజిక్ చేసారు. సోగ్గాడే చిన్నినాయనా సినిమాలో కొడుకు ఫ్యామిలీని సరిదిద్దడం కోసం ఆత్మగా భూమిపైకి వచ్చిన నాగార్జున, ఈ బంగార్రాజు లో మనవాడి కోసం భూమిపైకి ఆత్మగా అడుగుపెడతాడు. బంగార్రాజు ఫస్ట్ హాఫ్ అంతా పాత్రల పరిచయాలు, చిన బంగార్రాజు - నాగలక్ష్మి ల కొట్లాటలతో, మూడు కలర్ ఫుల్ సాంగ్స్ తో సాగగా.. సెకండ్ హాఫ్ లో అక్కడక్కడా.. కొంత ఊహాజనితంగా సాగినా.. నాగార్జునాన్ చెప్పే కొన్ని డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. అలాగే టెంపుల్ సీన్స్, ఇంకా ప్రీ క్లైమాక్స్ సీన్స్ ఆకట్టుకుంటాయి. అయితే ఎప్పటిలాగే నాగార్జున వన్ మ్యాన్ షో చేసారు. నాగ చైతన్య లుక్ విజ్ గ బావున్నా.. అంతగా నాగ చైతన్య పాత్ర ఎలివేట్ అవ్వలేదు.. నాగార్జున పాత్ర హైలెట్ అయ్యింది. అలాగే కొన్ని సీన్స్ లాజిక్ కి దూరంగా ఉంటాయి. కామెడీ లేకపోవడం, కొన్ని సీన్స్ నాటకీయంగా అనిపిస్తాయి కానీ నాగార్జున నటన, సాంగ్స్, విల్లెజ్ బ్యాక్ డ్రాప్ అన్ని సినిమాకి ప్లస్ అయ్యాయి.

సాంకేతికంగా..

అనూప్ రూబెన్స్ మ్యూజిక్ ఆకట్టుకుంది. విజువల్ గాను సాంగ్స్ బావున్నాయి. యువరాజ్ సినిమాటోగ్రఫీ హైలెట్ అనేలా ఉంది. పల్లెటూరి అందాలను యువరాజ్ కెమెరాలో బంధించారు.

రేటింగ్: 2.75/5

Bangarraju Movie Review:

<span>Nagarjuna, Naga Chaitanya offers Sankranti blast.</span>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs