గత కొన్నాళ్లుగా కమెడియన్ బ్రహ్మానందం సినిమాల్లో కనిపించడం తగ్గింది. ఈమధ్యనే ఓ షో లో బ్రహ్మి తన హవా సినిమాల్లో తగ్గడానికి కారణం తనకి అవకాశాలు రాకపోవడం కాదు అని, తానే కొద్దిగా గ్యాప్ ఇచ్చాను అని, ప్రస్తుతం తన చేతిలో చాలా సినిమాలు ఉన్నాయని చెప్పారు. అందులో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ లో నటిస్తున్నట్టుగా చెప్పారు. మరి బ్రహ్మానందం - పవన్ కాంబో మూవీస్ ఎంతగా కామెడీ జెనెరేట్ చేశాయో ఇప్పటివరకు చూసాం. మరి ఇప్పుడు భీమ్లా నాయక్ లో బ్రహ్మి పాత్ర పై అందరిలో ఆసక్తి మొదలైంది.
అయితే బ్రహ్మానందం పవన్ భీమ్లా నాయక్ లో ఫారెస్ట్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారని టాక్. ఆ పాత్రలోనే బ్రహ్మి కామెడీ పండిస్తారని తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గాను, రానా ఈగో నిండిన వ్యక్తిగా ఈ సినిమాలో హోరా హోరీగా తలబడబోతున్నారు. భీమ్లా నాయక్ ఈ సంక్రాంతికి రావాల్సి ఉండగా.. కొన్ని కారణాల చేత ఫిబ్రవరి 25 కి పోస్ట్ పోన్ అయ్యింది.