Advertisement
Google Ads BL

షణ్ముఖ్ కూల్ గా చూపించాడు


బిగ్ బాస్ సీజన్ 5 ముగిసిపోయి 25 రోజులు కావొస్తున్నా.. ఇంకా బిగ్ బాస్ సీజన్ 5 న్యూస్ లు సోషల్ మీడియాని వదలడం లేదు. టాప్ 5 కంటెస్టెంట్స్ ఇంటర్వూస్, సీజన్ రన్నర్ షణ్ముఖ్ బ్రేకప్ స్టోరీ, సిరి ఆమె బాయ్ ఫ్రెండ్ న్యూస్ లు ఇలా ఏదో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే బిగ్ బాస్ హౌస్ లో శ్రీరామ చంద్ర, సిరిలు ఐస్ టాస్క్ లో కాళ్ళకి గాయాలపాలై డాక్టర్స్ ట్రీట్మెంట్ తీసుకోవడమే కాదు..వారు సీజన్ 5 ముగిసి బయటికి వచ్చేసరికి వీరిద్దరి పాదాలన్నీ తోలు ఊడిపోయి కనిపించాయి. కాళ్ళకి డాక్టర్స్ కట్టు కట్టారు. బాబోయ్ వీళ్ళు ఈ ఐస్ టాస్క్ వలన చాలా సఫర్ అయ్యారనిపించింది అది చూస్తే. ఆ ఐస్ టాస్క్ లో షణ్ముఖ్ పాదాలకు కూడా గాయాలయ్యాయి.

Advertisement
CJ Advs

కానీ షణ్ముఖ్ కి అంతగా గాయాలు అవ్వలేదేమో.. అతను అంతగా సఫర్ అవ్వలేదు అనుకుంటే.. ఇప్పుడు షణ్ముఖ్ కూల్ గా తన పాదాల ఫొటోస్ ని ఇన్స్టా లో పోస్ట్ చేసాడు. ఆ పిక్ తో పాటుగా షణ్ముఖ్ స్వీట్‌ అండ్‌ రాడ్‌ మెమోరీ అనే క్యాప్షన్ పెట్టాడు. అంటే బిగ్ బాస్ హౌస్ లో అదో స్వీట్‌ అండ్‌ రాడ్‌ మెమోరీ అని షణ్ముఖ్ ఫీలింగ్. ప్రస్తుతం షణ్ముఖ్ దీప్తి సునయనతో బ్రేకప్ తర్వాత తాను కాస్త ఫీల్ అయినా.. వర్క్ లోకి దిగిపోతున్నట్టుగా చెప్పి ఫాన్స్ కి సర్ ప్రైజ్ ఇచ్చాడు. షార్ట్ ఫిలిం తో బిజీ కాబోతున్నాడో.. లేదంటే వెబ్ సీరీస్ లు ఏమైనా చేస్తాడో చూడాలి. 

Shanmukh Jaswanth Suffers Leg Injury:

Bigg Boss Contestant Shanmukh Jaswanth Suffers Leg Injury
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs