మెగాస్టార్ చిరంజీవి ఈ రోజు గురువారం ఏపీ సీఎం తో భేటీ అయ్యారు. సినిమా ఇండస్ట్రీ లోని సమస్యలపై మెగాస్టార్ చిరంజీవి సీఎం జగన్ ని కలిసి ఇండస్ట్రీ సమస్యల పరిష్కారానికి చర్చించారు. అయితే చిరు జగన్ తో భేటీ అవడమే కాదు.. జగన్ తో కలిసి లంచ్ కూడా చేసారు. జగన్ చిరు ని చూడగానే ఆచార్య అంటూ ఆహ్వానించడం ఆసక్తికరంగా మారింది. ఇక జగన్ ఇండస్ట్రీ సమస్యలపై సానుకూలంగా స్పందించారని చిరు జగన్ భేటీ తర్వాత మీడియా తో మాట్లాడారు. జగన్ సినిమా పరిశ్రమ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని, ఆయన ఆలా చెప్పడం ధైర్యాన్ని ఇచ్చింది అని చిరు చెప్పారు.
అయితే మెగాస్టార్ చిరంజీవి జగన్ తో కలిసి లంచ్ చేసారు. ఆ లంచ్ లో స్పెషల్ ఏమిటంటే.. మెగాస్టార్ కోసం జగన్ స్పెషల్ మటన్ బిర్యానీ చేయించి ప్రత్యేకంగా ఆతిథ్యమిచ్చారని అంటున్నారు. జగన్ చిరు తో కలిసి ఆత్మీయంగా భోజనం చేసారని, ఇంకా ఆ లంచ్ లో చాలా స్పెషల్స్ ఉన్నాయంటున్నారు. ఏది ఏమైనా జగన్ తో చిరంజీవి మీటింగ్ మాత్రం ఈ రోజు మీడియాలో చాలా హైలైట్ అయ్యింది.