Advertisement
Google Ads BL

సీఎం జగన్ తో చిరు మీటింగ్ స్పెషల్


ఏపీ సీఎం జగన్ తో ఇండస్ట్రీలోని ప్రముఖులు ఎవరు మీట్ అయినా.. అదో సెన్సేషన్ అవుతుంది. కారణం ఆంధ్రాలో సినిమా ఇండస్ట్రీ విషయంలో సీఎం జగన్ తీసుకునే కఠిన నిర్ణయాలే. ఇప్పటివరకు ఏపీ ప్రభుత్వాన్ని సినీ పెద్దలు అభ్యర్థిస్తున్నారు. టికెట్ రేట్స్ విషయంలో తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోమంటూ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని కలిసి విన్నవించుకుంటున్నారు. మధ్యలో నాగార్జున జగన్ ని మీట్ అయ్యి లంచ్ చేసి వచ్చారు. ఇక రీసెంట్ గా వైసిపి మంత్రులు vs తమ్మారెడ్డి భరద్వాజ అన్నట్టుగా ఉంది వ్యవహారం. మీకు బలిసింది అంటే మీకు బలిసింది అంటున్నారు. అలాగే దర్శకుడు ఆర్జీవీ ట్వీట్స్, పేర్ని నాని మీటింగ్ అంటూ వేడి వేడిగా ఉన్న టైం లో మెగాస్టార్ చిరు జగన్ ని కలవనున్నారనే న్యూస్ హాట్ టాపిక్ గా మరింది.

Advertisement
CJ Advs

ఏపీ సీఎం ని కలిసి ఆయనతో ఈరోజు గురువారం మెగాస్టార్ లంచ్ చెయ్యబోతున్నారు. మరి సినిమా ఇండస్ట్రీ మీద జగన్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేపట్టాక మెగాస్టార్ చిరు జగన్ ని కలవడం మొదటిసారి కావడంతో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. చిరు - జగన్ లంచ్ మీటింగ్ లో ఎలాంటి విషయాలు మాట్లాడతారు, ఏమేం మాట్లాడతారు, ఇండస్ట్రీ కి పనికొచ్చే అంశాలు ఉంటాయా.. లేదంటే జస్ట్ క్యాజువల్ మీటింగా అనేది తెలియాల్సి ఉంది. 

All eyes are on Chiranjeevi meet with CM Jagan:

<span>Chiranjeevi-CM Jagan meet: Will Tollywood come together</span>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs