తెలుగు చలన చిత్ర పరిశ్రమ నుండి సరి అయిన రెప్రెసెంటేషన్ లేదా లేదా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి ఇవ్వడానికి అని బాలకృష్ణ గారిని అఖండ సంక్రాంతి సంబరాలు మీట్ లో అడిగినప్పుడు దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చారు బాలకృష్ణ. రిప్రసెంటేషన్ కాదయ్యా అస్సలు అక్కడ ఆంధ్ర ప్రదేశ్ లో ఇండస్ట్రీ గురించి పట్టించుకునే నాధుడే లేడు కదా అన్నారు. బాలకృష్ణ సీనియర్ నటుడు మరియు రాజకీయాల్లో కూడా వున్నారు. మరి ఆయన ఎందుకు మాట్లాడలేదు అంటే, ఇది ఒక్కడు మాట్లాడే సమస్య కాదు అన్నారు.
తెలుగు చలన చిత్ర పరిశ్రమ అంతా ఒక తాటిపై నిలిచి ఏమి అభిప్రాయం తీసుకుంటే దానికే నేను కట్టుబడి వుంటా.. అదే నా అభిప్రాయం కూడా. ఇక్కడ ఒక్కరు మాట్లాడటం ఒక్కరి అభిప్రాయం తీసుకోవటం సమస్య కి పరిష్కారం కాదు. సమిష్టిగా అందరూ ఓకే అభిప్రాయానికి వచ్చి సమస్య పరిష్కారానికి మాట్లాడాలి అని చెప్పారు. నిజమే బాలకృష్ణ చెప్పింది నూటికి నూరు పాళ్ళు కరెక్ట్. అందరూ సమిష్టిగా చర్చించి అప్పుడు ఏపీ ప్రభుత్వ మెడలు వంచాలి.