నాగార్జున ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కు మంచి స్నేహితుడు అని అందరికి తెలుసు. అందుకే ఆమధ్య ఆంధ్రలో టికెట్ రేట్స్ గురించి అడిగినప్పుడు నాగార్జున తన సినిమాకి ఇప్పుడున్న టికెట్ రేట్ సరిపోతుంది అన్నాడు. అలాగే ఆంధ్ర లో కర్ఫ్యూ రాత్రి పది గంటల నుండి ఉదయం అయిదు వరకు ముందు పెట్టారు, అప్పుడు సెకండ్ షో సినిమా వుండకూడదు. సెకండ్ షో కోసం అని మళ్ళీ టైమింగ్ మార్చారు రాత్రి పన్నెండు నుండి అని.
అది కూడా నాగార్జునకె మంచి బెనిఫిట్ అవుతుంది. అయితే మరి నాగార్జునకి ఇన్ని చేసిన జగన్ ని నాగార్జున మర్చిపోయాడు. ఈమధ్య ఆంధ్ర రాజకీయ నాయకులు అన్నారు కదా సినిమా వాళ్ళకి ఆంధ్ర అక్కరలేదు, ఆంధ్ర ముఖ్యమంత్రి అక్కరలేదు అని. మరి నాగార్జున తన బంగార్రాజు ఈవెంట్స్ అన్ని హైదరాబాద్, తెలంగాణలోనే పెట్టాడు. ఒక్క ఈవెంట్ కూడా ఆంధ్ర లో ఎందుకు పెట్టలేదు. నాగార్జునకి జగన్ ఏమి చేసిన ఒకే కదా, మరి అలాంటప్పుడు బంగార్రాజు ప్రెస్ మీట్ అయినా వైజాగ్ లో పెట్టొచ్చు కదా. అంటే నాగార్జున కూడా ఆంధ్రాకి వెళ్ళాడు, జగన్ ని మర్చిపోయాడు. తనకి మంచి మిత్రుడు అని బయటకి చెప్పుకోవటం బెనిఫిట్ పొందటమే కాదు, తిరిగి ఏదైనా చెయ్యాలి కదా, అంటే బంగార్రాజు ఈవెంట్ ఆంధ్ర లో చెయ్యాలి కదా. మరి ఎందుకు చెయ్యలేదు నాగార్జున.? అంటున్నారు జనాలు.
Advertisement
CJ Advs