ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి సినిమావాళ్లని బలిసినారు అంటూ చీప్ కామెంట్స్ చేయాడంతో దానికి ప్రముఖ దర్శకుడు నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ చాలా గట్టిగా కౌంటర్ ఇచ్చారు. మీరు పిచ్చి పిచ్చి గా మాట్లాడటం మానుకోండి. గత ప్రభుత్వం లో కొంతమంది గడ్డి తిన్నారని, ఇప్పుడు మీరు గడ్డి తింటున్నారా? ఎవరు బలిసారు? మీ ఎమ్మెల్యేలు ఎవరెవరు ఎంత తింటున్నారో తెలీదా? ఓపెన్ డిబేట్ కి వస్తారా.. ఎమ్మెల్యేలు ఎంత తింటున్నారో మాట్లాడుకుందాం?
మీరు రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు మీ ఆస్తి ఎంత వుంది, ఇప్పుడు ఎంత వుంది. దేశాన్ని దోచుకుంటున్నది మీరే కదా? సినిమా వాళ్ళు కష్ట పడుతున్నారండి, కష్టపడి సంపాదిస్తున్నారు. అంతే కానీ పిచ్చి పిచ్చి గా మాట్లాడితే మర్యాదగా ఉండదు. మీ బలుపు మీరు ముందు చూసుకొని, తరువాత వేరే వాళ్ళ బలుపు గురించి మాట్లాడండి, అంటూ తమ్మారెడ్డి సెన్సేషనల్ గా మట్లాడారు.