పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ రేపు శుక్రవారం రిలీజ్ అవ్వాల్సి ఉంది. సాహో తర్వాత భారీ గ్యాప్ తో ప్రభాస్ ఈ పండగకి ఫాన్స్ కి కూల్ సర్ ప్రైజ్ ఇద్దామనుకుంటే.. కరోనా ప్రభాస్ రాధేశ్యామ్ కి హాట్ సర్ ప్రైజ్ ఇచ్చింది. కరోనా దెబ్బకి రాధేశ్యామ్ వాయిదా పడింది. లేదంటే ప్రభాస్ రాధేశ్యామ్ ప్రమోషన్స్ సోషల్ మీడియాలో బీభత్సంగా ఉండేవి. ప్రభాస్ ఫాన్స్ కూడా రెచ్చిపోయి మరీ రాధేశ్యామ్ ని ప్రమోట్ చేసేవారు. కానీ కరోనా వాళ్ళ ఉత్సాహంపై నీళ్లు చల్లింది. అయితే ప్రభాస్ రాధేశ్యామ్ ప్రమోషన్స్ లేకపోయినా, రాధేశ్యామ్ రిలీజ్ లేకపోయినా ప్రభాస్ ఫాన్స్ కి సర్ ప్రైజ్ ఇచ్చాడు.
అంటే టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు తన అన్న కొడుకు ఆశిష్ నటించిన రౌడీ బాయ్స్ కోసం టాలీవుడ్ లో తనకి పరిచయమున్న టాప్ హీరోయిలను వాడేస్తున్నారు. ముందుగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో రౌడీ బాయ్స్ ట్రైలర్ లాంచ్ చేయించిన దిల్ రాజు రీసెంట్ గా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో రౌడీ బాయ్స్ సాంగ్ రిలీజ్ చేయించారు. సో అలా ప్రభాస్ ఫాన్స్ కి కాస్త కొత్తగా కనిపించాడు. దిల్ రాజు, ఆశిష్, రౌడీ బాయ్స్ దర్శకుడు అంతా ప్రభాస్ తో ఈ సాంగ్ లాంచ్ చేయించి ఫొటోస్ దిగడంతో అవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ పిక్స్ లో ప్రభాస్ కొత్త గా కాప్ పెట్టుకుని.. కనిపించేసరికి డార్లింగ్ ప్రభాస్ కొత్త లుక్ అంటూ ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు.