వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ జనవరి పదో తేదీన విజయవాడ వెళ్లి ఆంధ్ర సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని ని కలిశారు. అయితే వర్మ వరుస ట్వీట్స్ తో పేర్ని నాని కి ప్రశ్నల పరంపర కురిపించటం, నాని సమాధానం ఇవ్వటం, చర్చలకు విజయవాడ ఆహ్వానించటం అన్ని చాలా త్వరితగతిని జరిగిపోయాయి. విజయవాడ వెళ్లి వచ్చాక, వర్మ తనకి మరియు నాని కి మధ్య జరిగిన సంభాషణ గురించి ఏమి ట్వీట్ చేయకపోవటం ఆశ్చర్యం కలిగించింది. మంత్రి తో మాట్లాడాక డైరెక్ట్ గా ఒక టీవీ ఛానల్ కి వెళ్లి అక్కడ చెప్తారు అని ఎదురు చూసారు.
కానీ చూస్తే అక్కడ వాళ్ళు సినిమా విషయాలు, నాని - ఆర్జీవీ మధ్యన జరిగిన సంభాషణ వివరాలు కాకుండా ఇంకేదో మాట్లాడారు. ఎందుకు సినిమా టికెట్స్ రేట్లు పెంచాలి అన్న విషయం మీద చర్చ తప్ప మంత్రి గారికి తనకి మధ్య ఎటువంటి చర్చ జరిగింది, వర్మ ఏమి అడిగాడు మంత్రిని, మంత్రి ఏమన్నారు అన్న విషయం మాత్రం రాలేదు. కానీ విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, మంత్రి గారు ఆర్జీవీ ని పిలిచి బాగా క్లాస్ పీకారని తెలిసింది. ఆర్జీవీ జగన్ కి మిత్రుడని చెప్పుకుంటూ ఎందుకు అలా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టె ట్వీట్ చెయ్యడం అని క్లాస్ పీకారు అని తెలుస్తుంది. అయితే ఆర్జీవీ ఎవరి మాట వినరు కదా. చూడాలి ముందు ముందు ఏమి అవుతుందో..