Advertisement
Google Ads BL

కరోనా కోరల నుంచి కట్టప్ప సేఫ్


కరోనా థర్డ్ వేవ్ స్టార్ట్ అయ్యాక చాలామంది సినీ, రాజకీయ ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. కొంతమంది ఆసుపత్రి పాలవగా మరికొంతమంది ఇంట్లోనే ఉండి వైద్యం చేయించుకుంటున్నారు. టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు దగ్గరనుండి.. సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ వరకు, థమన్, లక్ష్మి మంచు ఇలా వరసగా కరోనా బారిన పడ్డారు. అయితే తమిళంలోనూ ఈ కరోనా కలకలం మాములుగా లేదు. త్రిష, సీనియర్ నటుడు సత్య రాజ్ అదేనండి బాహుబలి కట్టప్పలు కరోనా బారిన పడ్డారు.

Advertisement
CJ Advs

 

అయితే నాలుగైదు రోజుల క్రితం సత్య రాజ్ కి సీరియస్ అవడంతో హోమ్ క్వారంటైన్ లో ఉన్న ఆయన్ని ఫ్యామిలీ మెంబెర్స్ హుటాహుటిన చెన్నై ఆసుపత్రికి తరలించారు. అప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది అని, కండిషన్ సీరియస్ అంటూ వార్తలు రావడంతో అభిమానులు ఆందోళనకి గురయ్యారు. అయితే తాజాగా సత్య రాజ్ కోలుకున్నారని సత్య రాజ్ కొడుకు సోషల్ మీడియాలో ట్వీట్ చేసారు. తన తండ్రి ఆరోగ్యంగానే ఉన్నారని, కరోనా కోరల నుంచి కోలుకుని కట్టప్ప సేఫ్ గా ఆసుపత్రి నుండి డిస్ ఛార్జ్ అయ్యి ఇంటికి వచ్చారని, ప్రస్తుతం కొన్ని రౌజుల పాటు ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అని.. త్వరలోనే షూటింగ్స్ లో పాల్గొంటారంటూ ట్వీట్ చెయ్యడంతో కట్టప్ప అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

Baahubali star Sathyaraj discharged from hospital:

Actor Sathyaraj discharged from hospital
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs