ఈ సంక్రాంతి కి టాలీవుడ్ కి ఇద్దరు సినిమా ఇండస్ట్రీ వారసులు హీరోలుగా లాంచ్ అవుతున్నారు. ఆ హీరోలిద్దరి ఫామిలీస్ టాలీవుడ్ లో టాప్ పొజిషన్ లో ఉన్న ఫామిలీస్. ఒకరు దిల్ రాజు బ్రదర్ కొడుకు కాగా.. మరొకరు సూపర్ కృష్ణ మనవడు, మహేష్ మేనల్లుడు గల్లా అశోక్ లు. దిల్ రాజు బ్యానర్ నుండి ఆశిష్ రౌడీ బాయ్స్ తో, అశోక్ గల్లా హీరో మూవీ ఓ ఈ పొంగల్ కి ఫైట్ కి దిగుతున్నారు . పొంగల్ రేస్ లో ఉన్న పెద్ద సినిమాలు వాయిదా పడడంతో ఈ డెబ్యూ హీరోలిద్దరూ ఇప్పుడు పోటీకి దిగారు.
ఇద్దరూ కొత్త హీరోలు.. ఆ ఇద్దరూ ఫస్ట్ సినిమాతోనే అందరిలో ఆసక్తిని క్రియేట్ చెయ్యాలనే ఆలోచనతో.. తమ సినిమాల్లో హీరోయిన్స్ తో లిప్ లాక్ చేసే సీన్స్ పెట్టించారు. అందులో అశోక్ గల్లా మంచి ఫామ్ లో ఉన్న నిధి అగర్వాల్ పెదవులని జుర్రేసాడు. అంతేకాదు.. ఆశిష్ కూడా అనుపమ పరమేశరన్ తో చేసిన లిప్ లాక్ సంచలంగా మారింది. మొదటి సినిమాలతోనే.. పేరున్న హీరోయిన్స్ తో ఈ కుర్ర హీరోలు లిప్ లాక్స్ ఈ పొంగల్ కి స్పెషల్ గా ఉండబోతుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ లో ఆ లిప్ లాక్స్ హైలెట్ గా కనబడుతున్నాయి.