Advertisement
Google Ads BL

హీరో టీం కృష్ణ గారి పేరు ఎత్తకుండా ఉండాల్సింది


గల్లా అశోక్ డెబ్యూ సినిమా హీరో ఈ సంక్రాంతికి విడుదల అవుతోంది. రిలీజ్ డేట్ ఇచ్చినప్పటినుండి ప్రమోషన్స్ స్టార్ట్ చేసి అందరి ఇంటర్వూస్ పెట్టారు.  అందులో భాగంగా దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య కూడా మీడియా తో మాట్లాడారు. ఆయన కృష్ణ గారు హీరో సినిమా చూసి చాలా బాగుందని చెప్పారని చెప్పారు. కానీ కృష్ణ గారు సినిమాని ఎప్పుడు చూసారు? అన్న ప్రశ్న వస్తుంది కదా. కృష్ణ గారు తన పెద్ద కొడుకు రమేష్ బాబు ఆకస్మిక మృతితో బాధలో ఉంటే ఈ హీరో సినిమా ఎప్పుడు చూసారు. 

Advertisement
CJ Advs

కృష్ణ గారు ఇంకా  ఆ షాక్ నుండి తేరుకోక ముందే ఎలా చూస్తారు ఈ సినిమా. దర్శకుడు ఆ మాట చెప్పకుండా ఉండాల్సింది. రమేష్ బాబు గత కొద్దీ రోజులుగా అనారోగ్యంగా వున్నప్పుడు కృష్ణ గారు ఇలా సినిమాలు చూసుకుంటూ ఉంటే ప్రజలు, ఆయన అభిమానులు ఏమనుకుంటారు. రమేష్ బాబు పోయిన కృష్ణ గారు అలా ఎలా మామూలుగా ఉండగలుగుతారు, ఆయనకి అస్సలు ఏమి పట్టదా అన్న ప్రశ్న వస్తుంది కదా. అందుకే ఆ ఫామిలీ ని అలా వదిలేస్తే బాగుంటుంది. హీరో సినిమా ఎలాగు రిలీజ్ అవుతోంది, బాగుంటే చూస్తారు, లేకపోతే అంతే సంగతులు. కృష్ణ గారు బాగుంది అంటే అందరు వచ్చి చూసేస్తారా ఏంటి? సినిమాలో దమ్ముండాలి. అనవసరంగా కృష్ణ గారిని ఈ విషాద సమయం లో ఇలా లాగటం ఏమాత్రం బాగోలేదు.

Director Sriram Aditya about Hero Krishna:

Sriram Aditya about Hero Movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs