బంగార్రాజు సినిమా ఊహలకు మించి ఉంటుందని, సక్సెస్ మీట్ లో మాట్లాడతా అని నాగార్జున ఇటీవల జరిగిన ఆ సినిమా మ్యూజికల్ నైట్ లో అన్నారు. ఇది నిజంగానే బాగుందా, లేక నాగార్జున అతి విశ్వాసమా? గతం లో చాలా సినిమాలకి ఇలానే మాట్లాడారు నాగార్జున, కానీ సినిమాలు విడుదల అయ్యాక ఆ సినిమా అడ్రస్ గల్లంతు అయింది. ఆ మధ్య రిలీజ్ అయినా మన్మధుడు 2 గురించి కూడా ఆ సినిమా రిలీజ్ ముందు నాగార్జున ఇలానే మాట్లాడారు. ఆ సినిమా ట్రైలర్ కూడా చాలా బాగుంది. కానీ సినిమా రిలీజ్ అయ్యాక బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.
ఇప్పుడు మళ్ళీ బంగార్రాజు కి కూడా నాగార్జున అలానే మాట్లాడుతున్నారు. సినిమా హిట్ అయితే మంచిదే, కానీ తేడా జరిగితే ఏంటి పరిస్థితి. అయితే సినిమా వాళ్ళకి ఇది మామూలే, సినిమా రిలీజ్ ముందు ఏవేవో మాట్లాడతారు, కానీ రిలీజ్ అయ్యాక అడిగితే, అవన్నీ ప్రమోషన్స్ లో ఒక పార్ట్ అంటారు. ఏమైనా కూడా అంత అతి విశ్వాసం పనికి రాదు నాగార్జున గారు? కాన్ఫిడేన్స్ మంచిదే కానీ, ఓవర్ కాన్ఫిడెన్స్ మంచిది కాదు. మరి మీ నమ్మకం ఏమిటో.?