దర్శకుడు కొరటాల శివ చిరంజీవి కలయిక లో వస్తున్న ఆచార్య సినిమా కథ ఎక్కడిది అన్న ప్రశ్న చాలా రోజులుగా సోషల్ మీడియా లో అనేక రకాలుగా తిరుగుతోంది. అయితే దర్శకుడు కొరటాల శివ తన సినిమాలు అన్ని ఒక సామజిక అంశాన్ని తీసుకొని దానికి కమర్షియల్ హంగులు పెడతాడు. అతని సినిమాలు అన్నీ ఆలోచించే విధంగా ఉంటాయి. అయితే ఇప్పుడు ఆచార్య సినిమా కూడా దేవాదాయ భూములు పేద రైతులకు పంచిపెట్టే నేపధ్యంలో వస్తున్న కథ అని అంటున్నారు. కొరటాల శివ కమ్యూనిస్ట్ కుటుంబం నుండి వచ్చిన వాడు కావటం వల్ల అతని ఆలోచన ధోరణి కూడా అతని సినిమాల వలె భిన్నంగా ఉంటుంది.
అయితే ఈ ఆచార్య సినిమా కథ శ్రీకాకుళం జిల్లాలో ఎప్పుడో డెబ్బయ్యవ దశకం లో జరిగిన కథ అని తెలిసింది. సుబ్బారావు పాణిగ్రాహి అనే అతను ఒకరు బొడ్డుపాడు అనే గ్రామంలో అప్పట్లో ఒక ఉద్యమం చేసారు. సుబ్బారావు అనే అతను ఒరిస్సా నుండి వచ్చి ఈ గ్రామంలో ఒక శివుడి గుడిలో పూజారిగా ఉంటూ భూస్వాములకు వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టాడు. అతని జీవితం కూడా ఒక పుస్తకంగా సుబ్బారావు పాణిగ్రాహి జీవితం అని అప్పట్లో వచ్చింది. అతని ఉద్యమాన్ని ఆ తరువాత అతని తమ్ముడు హేమచంద్ర పాణిగ్రాహి చేపట్టాడు. అదే కాలంలో ఆదిభట్ల కైలాసం, వెంపటి సత్యం లాంటి నక్సలైట్స్ కూడా అదే బొడ్డుపాడు గ్రామం నుండి సుబ్బారావు కి చేదోడుగా ఉద్యమంలో నిలిచారు. వీరిద్దరూ ఉపాధ్యాయులుగా పని చేసి అక్కడ ప్రజలని చైతన్య వంతులని చేసేవాడు. ఇప్పుడు కొరటాల శివ సినిమా ఆచార్య అని పెట్టడానికి కూడా అదొక కారణం అని అనుకోవచ్చు. కొరటాల శివ ఈ సుబ్బారావు పాణిగ్రాహి జీవితం పుస్తకం ఆధారంగా ఆచార్య సినిమా చిన్న చిన్న మార్పులతో తీసినట్టు తెలుస్తోంది.