సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కొడుకు, మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు శనివారం రాత్రి అనారోగ్య కారణాలతో ఆసుపత్రికి తరలించేలోపే మరణించారు. ఆయన మరణంతో ఘట్టమనేని ఫ్యామిలీతో పాటుగా సినిమా ఇండస్ట్రీ ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు. గచ్చి బౌలి లోని ఏఐజీ ఆసుపత్రికి తరలించేలోపే రమేష్ బాబు మరణించడంతో.. తర్వాత ఆయన మృతదేహాన్ని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. రమేష్ బాబు భౌతిక కాయాన్ని పద్మాలయ స్టూడియోస్ కి తరలించి.. అక్కడ కుటుంబ సభ్యుల సందర్శనం కోసం.. ఉంచుతారు. అయితే ప్రస్తుతం కోవిడ్ పరిస్థిలు దృష్ట్యా రహేష్ బాబు కి నివాళులు అర్పించేందుకు ఎవరూ రావద్దని.. ప్రస్తుతం ఉన్న పరిస్తితుల్లో ఎవరూ గుమ్మిగూడవద్దు అంటూ ఘట్టమనేని ఫ్యామిలీ అభిమానులకి ఓ ప్రకటన విడుదల చేసింది.
ఇక రమేష్ బాబు భౌతిక కాయాన్ని సినీప్రముఖులు, కుటుంబ సభ్యులు సందర్శనాంతరం.. పద్మాలయ స్టూడియోస్ నుండి అంతిమ యాత్రను ప్రారంభించి 12 గంటల ప్రాంతంలో జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానం శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహిస్తాం అని ఘట్టమనేని ఫ్యామిలీ ఆ ప్రకటనలో తెలియజేసారు.