రాహుల్ రవీంద్రన్ తన మూడో సినిమా రష్మిక మందన్న తో చేస్తున్నాడు. గీత ఆర్ట్స్ బన్నీ వాస్ దీన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. రష్మిక ఇప్పుడు బిజీ స్టార్ హీరోయిన్ అయిపొయింది, అందుకని ఈ సినిమా తొందరగా మొదలు పెట్టాలని దర్శకుడు మరియు నిర్మాతలు ఆలోచిస్తున్నారు. ఇందులో రష్మిక పాత్ర చుట్టూ నే కథ అంత తిరుగుతూ ఉంటుంది. రాహుల్ ఈసారి ఒక విభిన్నమయిన కథని ఎంపిక చేసుకున్నాడని తెలిసింది.
భారత మాజీ ప్రధాని పి వీ నరసింహ రావు అప్పట్లో భారత దేశ ఆర్ధిక వ్యవస్థ చిన్న భిన్నంగా ఉంటే, తన చేపట్టిన ఆర్ధిక సంస్కరణల వాళ్ల భారత దేశ ఆర్ధిక వ్యవస్థ నిలబడింది. అటువంటి నేపధ్యాన్ని రాహుల్ తీసుకొని ఒక కిరానా కొట్టు పెట్టుకున్న అమ్మాయి ఎలా ఎదిగింది ఏమి చేసింది ఈ ఆర్ధిక సంస్కరణలు ఎలా ఉపయోగ పడ్డాయి అన్న పాయింట్ మీద తీసుకున్నారు. అయితే కథ చాలా బాగా వచ్చిందని తెలిసింది. ఈ కథ నేపధ్యం కూడా సుమారు 1995 సంవత్సరంలో జరిగిన కథగా చిత్రీకరించనున్నారు.