Advertisement
Google Ads BL

బంగార్రాజు సెన్సార్ టాక్


నాగార్జున - కళ్యాణ్ కృష్ణ కాంబో మరోసారి సంక్రాంతి కి హిట్ కొట్టేందుకు రెడీ అయ్యారు. ఈసారి నాగ చైతన్య తో బంగార్రాజు రెడీ అయ్యింది. మొదలు పెట్టిన కొద్ది నెలలకే రిలీజ్ కి రెడీ చేసి షాకిచ్చారు నాగార్జున, బంగార్రాజు మూవీ ని భోగి రోజున అంటే జనవరి 14 న థియేటర్స్ లో రిలీజ్ చెయ్యబోతున్నారు. రిలీజ్ డేట్ ఇవ్వకుండానే.. బంగార్రాజు ప్రమోషన్స్ మొదలు పెట్టేసింది టీం. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం, నాగార్జున, నాగ చైతన్య ఎనర్జిటిక్ లుక్స్ అన్ని సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి. తాజాగా బంగార్రాజు సెన్సార్ పనులని పూర్తి చేసుకుంది.

Advertisement
CJ Advs

సెన్సార్ బోర్డు బంగార్రాజు కి యు/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. దీనికి సంబంధించిన ఓ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బంగార్రాజు నిడివి ఎంతంటే రెండు గంటల నలబై నిమిషాల నిడివి.. అలాగే ఈ సినిమాలో నాగార్జున సోగ్గాడు కేరెక్టర్, బంగార్రాజు గా నాగ చైతన్య కేరెక్టర్ హైలెట్ అవ్వగా, కృతి శెట్టి - నాగ చైతన్య రొమాన్స్ సినిమాకి హైలెట్స్ గా నిలవబోతున్నట్టుగా సెన్సార్ టాక్ చెప్పేస్తుంది. మరి ఫుల్ స్వింగ్ లో ప్రమోషన్స్ మొదలు పెట్టి ఛానల్స్ ఇంటర్వూస్, కలర్ ఫుల్ ప్రమోషన్స్ తో ప్రేక్షకులని రప్పించేందుకు నాగార్జున అన్ని ఏర్పాట్లని పక్కాగా మొదలు పెట్టేసారు.

Bangarraju Censor Talk:

Nagarjuna Bangarraju Censor Talk
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs