గత ఏడాది డిసెంబర్ లో భారీ అంచనాల నడుమ రిలీజ్ అయ్యి.. ప్రేక్షకుల మెప్పు పొంది.. సూపర్ హిట్ అయిన బాలకృష్ణ అఖండ, నాని శ్యామ్ సింగ రాయ్ ఇప్పుడు యుద్దానికి రెడీ అయ్యాయి. బోయపాటి దర్శకత్వంలో బాలకృష్ణ అఖండ తో గర్జించారు. బాలయ్య నట విశ్వరూపం, థమన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అన్నీ సినిమాని సూపర్ హిట్ వైపు నడిపించాయి. అదే నెల 24 న క్రిష్ట్మస్ మనదే, క్రిష్ట్మస్ మనదే అంటూ నాలుగు భాషల్లో నాని శ్యామ్ సింగ రాయ్ ని రిలీజ్ చెయ్యగా.. ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. నాని పెరఫార్మెన్స్, సాయి పల్లవి నటన, రాహుల్ సంకీర్తయన్ దర్శకత్వం అన్ని సినిమాని విజయ తీరానికి నడిపించాయి.
ఇక నాని బాలకృష్ణ అన్ స్టాపబుల్ టాక్ షో కి హాజరై బాలయ్య తో స్టేజ్ పై సందడి చేసాడు. అయితే ఇప్పుడు నాని - బాలయ్య లు యుద్దానికి రెడీ అయ్యారు. నాని vs బాలయ్య అన్న రేంజ్ లో వాళ్లిద్దరూ నటించిన సినిమాలు ఒకేసారోజు, ఒకే టైం కి ఓటిటిలో సమరానికి సై అంటున్నాయి. బాలకృష్ణ అఖండ మూవీ హాట్ స్టార్ ఓటిటి నుండి ఈ నెల 21 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అదే రోజు నాని శ్యామ్ సింగ రాయ్ కూడా నెట్ ఫ్లిక్స్ నుండి రాబోతుంది. మరి ఒకే రోజు రెండు హిట్ సినిమాల మధ్యన పోటీ మాత్రం రసవత్తరంగా కనిపిస్తుంది.