షణ్ముఖ్ - దీప్తి సునయన అఫీషియల్ గా విడిపోయారు. బిగ్ బాస్ 5 వాళ్ళిద్దరి బ్రేకప్ కి కారణమైంది. షణ్ముఖ్ అంటే నచ్చని దీప్తి సునయన అతనికి బ్రేకప్ చెప్పేసింది. ఐదేళ్లుగా కెరీర్ ని వదులుకుని షణ్ముఖ్ సేవలో తరించినట్టుగా చెప్పిన సునయన ఇకపై కెరీర్ గురించి ఆలోచిస్తాను అంటూ ట్విస్ట్ ఇచ్చింది. ఇక కెరీర్ లో ముందుకు సాగాలని అనుకుంటున్నాను అని, అందుకే ఇలా అంటూ చెప్పిన దీప్తి సునయన బ్రేకప్ వెనకాల ఎవరున్నారో చెప్పుకొచ్చింది.అంటే తాను షణ్ముఖ్ తో విడిపోయినా.. తాను ఒంటరిని కాదు అని తనకి తన తండ్రి తోడు ఉన్నదంటూ తండ్రితో ఉన్న ఫోటో షేర్ చేసింది.
షణ్ముఖ్ కూడా ఆమె నిర్ణయాన్ని గౌరవిస్తున్నాను. తనకు ఎలాంటి నిర్ణయమైనా తీసుకునే హక్కు ఉంది. ఆల్ ది బెస్ట్ దీపు.. అంటూ చెప్పుకొచ్చాడు.
తన తండ్రి తన వెనుక ఉన్నారంటూ షణ్ముఖ్ లేకపోయినా తనకేం ప్రాబ్లెమ్ లేదన్నట్టుగా చెప్పింది. తన బలం తన తండ్రి అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. షణ్ముఖ్ బిగ్ బాస్ లో సిరి తో చేసిన స్నేహం వలన బ్రేకప్ చేసుకున్న దీప్తి సునయన ఇకపై సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుందేమో చూద్దాం. అటు సిరి - శ్రీహన్ ల ప్రేమాయణం కూడా ముగిసిపోయేలా ఉంది అంటూ వార్తలొస్తున్నాయి.