Advertisement
Google Ads BL

హాఫ్‌ స్టోరీస్‌ రివ్యూ


హాఫ్‌ స్టోరీస్‌ రివ్యూ 

Advertisement
CJ Advs

బ్యానర్: వెన్నెల క్రియేషన్స్

నటీనటులు: రాజీవ్, రంగస్థలం మహేష్, రాకేందు మౌళి, సంపూర్ణేష్‌ బాబు, కోటి, కంచరపాలెం రాజు, టీఎన్ఆర్‌ తదితరులు

సంగీతం: కోటి

సినిమాటోగ్రఫీ : చైతన్య కందుల

ఎడిటర్‌: సెల్వ కుమార్‌

నిర్మాత: యం. సుధాకర్ రెడ్డి  

దర్శకత్వం :  శివ వరప్రసాద్. కె

కొత్త కొత్త కథలతో టాలీవుడ్ లోకి కొత్త దర్శకులు ఎంట్రీ ఇస్తూ.. ప్రేక్షకులని మెప్పించే సినిమాలు చేస్తున్నారు. అలాంటి నేపథ్యంలో ఢిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో వచ్చిన కథే హాఫ్‌ స్టోరీస్‌. ఈ సినిమాలోలో రాజీవ్, రంగస్థలం మహేష్, రాకేందు మౌళి, కంచరపాలెం రాజు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ కోటి సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కి మంచి స్పందన రావడంతో పాటు సినిమాపై ఆసక్తిని పెంచింది. ఓ మోస్తరు అంచనాలతో జనవరి 7న ప్రేక్షకుల ముందుకు వచ్చింది హాఫ్‌ స్టోరీస్‌ సినిమా.

కధ: 

సిస్టెంట్‌ డెరెక్టర్‌గా పనిచేసే శివ(రాకెందు మౌళి), తన స్నేహితులు లక్ష్మీ(శ్రీజ), చిన్నా(జబర్దస్థ మహేశ్‌) మధ్య జరిగే మోసాల నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుంది. బ్యాంక్‌ క్యాష్‌ వ్యాన్‌ ప్రమాదానికి గురికావడం.. ఆ డబ్బును కాసేయడానికి ఈ ముగ్గురు ఒకరిపై ఒకరు మోసానికి పాల్పడుతుంటారు. చివరికి ఆ డబ్బులు ఎవరికి సొంతం చేసుకున్నారు? ఆ డబ్బును చేజిక్కుంచుకునే క్రమంలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఆ ముగ్గురిలో దెయ్యాలు ఎవరు? మనుషులు ఎవరు? ఈ కథలోకి సంపూర్ణేష్‌ బాబు ఎలా ఎంటర్‌ అయ్యాడు? స్నేహితుల మధ్య జరిగే మోసాలు ఈ కథ ప్రధానంగా సాగుతుంది. 

పెరఫార్మెన్స్

యువ దర్శకుడు శివగా రాకెందు మౌళి తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. గౌతమ్‌గా రాజీవ్‌,  చిన్నగా మహేశ్‌, సినిమా రచయిత సంపూగా సంపూర్ణేశ్‌ బాబు,  రాఘవ్‌గా జెమిని సురేశ్‌, ఎస్సై శశికాంత్‌గా టీఎన్‌ఆర్‌, లక్ష్మీగా శ్రీజ, ఆధ్యాగా అంకిత ఇలా... అందరూ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. 

విశ్లేషణ: 

టాలీవుడ్ లో దెయ్యాల కాన్సెఫ్ట్‌తో చాలా సినిమాలు తెరకెక్కాయి. వాటిలో చాలా వరకు హిట్‌ కూడా కొట్టాయి. హాస్‌ స్టోరీస్‌ కూడా ఆ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమే. కథా నేపథ్యం పాతదే అయినప్పటికీ.. చాలా కొత్తగా, డిఫరెంట్‌గా తెరకెక్కించాడు దర్శకుడు శివ వరప్రసాద్. అక్కడక్కడా ట్విస్ట్‌లో సినిమా మొత్తాన్ని ఆసక్తికరంగా నడిపించాడు. శివ అనే అప్‌కమింగ్‌ డైరెక్టర్‌ తన స్నేహితులకు స్టోరీ చెప్పడం.. ఆ స్టోరీలో ఇంకో స్టోరీ రావడం..ఇదంతా ఓ బాలుడు సినిమాగా చూడడం.. ఇలా వరుస ట్విస్ట్‌లతో హాఫ్‌ స్టోరీస్‌ సినిమా సాగుతుంది.  సినిమాలో మనుషులు ఎవరో, దెయ్యాలు ఎవరో తెలియకుండా.. క్షణ క్షణానికి ఓ ట్విస్ట్‌ ఇచ్చి ప్రేక్షకుడి సీటుకే కడ్డిపడేశాడు. కొన్ని ఎపిసోడ్స్ ఆలరిస్తాయి. దర్శకుడు రాసుకొన్న ట్రిక్కీ స్క్రీన్ ప్లే మెదడుకు పదును పెడుతుంది. అయితే ఈ సినిమాకు ప్రధానంగా సాగే కథ లేకపోవడం గందరగోళానికి గురిచేస్తుంది. కానీ ఒక్కో ఎపిసోడ్ థ్రిల్లింగ్‌కు గురిచేస్తుంది. అయితే ఈ హాఫ్ స్టోరిస్‌కు కొనసాగింపుగా రెండో పార్ట్ ఉంటుందనే సంకేతాలు ఇవ్వడంతో అసలు కథ, కథలకు ఏదో లింక్ రివీల్ చేసే అవకాశం ఉందనే ఫీలింగ్ కలుగుతుంది. అది సినిమాకు ఎంత ప్లస్‌ అయిందే.. అంతే మైనస్‌ అయింది కూడా. కాకపోతే సగటు ప్రేక్షకుడికి సినిమాలోని ట్విస్టులన్నీ గందరగోళంగా అనిపిస్తాయి. అసలు స్టోరీ ఏంటనేది తెలియక అయోమయానికి గురవుతాడు. అయినప్పటికీ.. సినిమా మాత్రం ఎక్కడా బోర్‌ కొట్టించకుండా జాగ్రత్త పడ్డాడు దర్శకుడు. అయితే టైటిల్‌ మాదిరే ఒక్కో స్టోరీని పూర్తిగా చూపించకుండా హాఫ్‌, హాఫ్‌గా చూపించి.. సగం సినిమా మాత్రమే చూశామనే ఫీలింగ్‌తో ప్రేక్షకుడు బయటకు వచ్చేలా చేశారు. క్లైమాక్స్‌లో అయినా ఈ ట్విస్ట్‌లన్నింటికీ పుల్‌స్టాఫ్‌ పెడిగే బాగుండేది. పార్ట్‌-2 ఉంది కాబట్టి ఆ చిక్కుముడులన్నీ అలానే వదిలేశాడేమో దర్శకుడు. 

సాంకేతికంగా:

మ్యూజిక్ డైరెక్టర్ కోటి మ్యూజిక్ అందించారు. కొన్ని సన్నివేశాలను కోటి తన మ్యూజిక్‌తో ఫీల్‌గుడ్ ఫ్యాక్టర్‌ను కల్పించాడు. ఇక చైతన్య కందుల సినిమాటోగ్రఫి ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. కత్తి మీద సాముగా మారిన ఎడిటింగ్‌ ప్రక్రియను సెల్వకుమార్ సమర్ధవంతంగా నిర్వహించాడు. స్టోరీ ఫ్లోను స్మూత్‌గా ముందుకు తీసుకెళ్లడంలో తన ప్రతిభను చాటుకొన్నాడు. ఎం సుధాకర్ రెడ్డి పాటించిన నిర్మాణ విలువలు కథానుసారం బావున్నాయి. 

రేటింగ్: 2.5/5

Half Story Movie Telugu review:

Half Story Movie review
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs