రానా దగ్గుబాటి మరియు సాయి పల్లవి జంటగా నటించిన విరాట పర్వం ఓ టి టి లో రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారని వినికిడి. ఆ సినిమా ఎప్పుడో పూర్తి అయిపొయింది, కానీ నిర్మాత సురేష్ బాబు ఎందుకో ఆ సినిమాని విడుదల చెయ్యడానికి ఒప్పుకోలేదు. వేణు ఉడుగుల ఈ చిత్రానికి దర్శకుడు. నక్సలైట్ నేపధ్యం లో వచ్చిన కథ ఇది. అయితే సురేష్ బాబు ఇంతకు ముందు తన రెండు సినిమాలు దృశ్యం 2 , నారప్ప ఓ టి టి లోనే విడుదల చేసారు. ఎందుకంటే సురేష్ బాబు ఎప్పుడూ బిజినెస్ పరంగానే ఆలోచిస్తారు. అవి ఎక్కడ రిలీజ్ అయినా తనకి లాభసాటిగా ఉంటే చాలు అని అతని అభిప్రాయం. అందుకనే ఆ రెండు సినిమాలు ఓ టి టి లో రిలీజ్ చేసారు.
ఇప్పుడు విరాట పర్వం కూడా అదే విధంగా చెయ్యాలని సురేష్ బాబు ఆలోచన. ప్రస్తుత పరిస్థితులు ప్రకారం చాలా పెద్ద సినిమాలు వాయిదా పడిన విషయం తెలిసిందే, అయితే వీటి ప్లేస్ లో సురేష్ బాబు విరాట పర్వం రిలీజ్ చేయొచ్చు. కానీ ఆయన ముందుకు రాలేదు. ఎందుకంటే ఒక ప్రైవేట్ ఛానల్ సురేష్ బాబు కి భారీ ఆఫర్ ఇచ్చినట్టు టాలీవుడ్ లో భోగట్టా. అందుకనే సురేష్ బాబు అటువైపు మొగ్గు చూపుతున్నారని వినికిడి. ఎలాగూ ఏపీలో కూడా టికెట్ రేట్స్ ఇష్యు నడుస్తున్న టైం లో సురేష్ బాబు.. ఇప్పటికే కోవిడ్ కారణంగా నా 80 శాతం థియేటర్స్ మూసుకున్నాను.. ఇకపై నేను తీసే సినిమాలు ఓ టి టి లో రిలీజ్ చేస్తానంటూ బహిరంగంగానే మాట్లాడారు.