మహేష్ బాబు మేనల్లుడు, కృష్ణ గారి మనవడు గల్లా అశోక్ మొదటి సినిమా హీరో ఈ సంక్రాంతికి విడుదల కాబోతుంది. ప్రమోషన్స్ కూడా ఇప్పుడే స్టార్ట్ చేసి ఫుల్ స్వింగ్ లో ఇంకా జనాల్లోకి తీసుకెళ్లడానికి కేవలం ఒక వారం మాత్రమే టైం వుంది. వీళ్ళ ఆశలన్నీ సూపర్ స్టార్ మహేష్ బాబు పైనే పెట్టుకున్నారు. హీరో కి ఒక ఈవెంట్ పెట్టి మహేష్ ని గెస్ట్ గా పిలుద్దామని అనుకున్నారు. అలా చేస్తే, కొంచెం అయినా హీరో ప్రేక్షకుల్లోకి వెళుతుందని గల్లా కుటుంబం ఆశ. అయితే ఇప్పుడు మహేష్ కి పాజిటివ్ అని ట్విట్టర్ లో పెట్టాడు. ఈ విషయం మహేష్ కన్నా ముందు గల్లా కుటుంబాన్ని కలవర పెడుతోంది.
ఎందుకంటే మహేష్ మీద గంపెడాశ పెట్టుకున్న గల్లా కుటుంబం, ఇప్పుడు వేరే గెస్ట్ ని వెతుక్కోవాలి, లేదా వాళ్ళకి వల్లే ప్రమోషన్స్ చేసుకోవాలి. ఎంత డబ్బులున్నా, ఎంత పెద్ద కుటుంబం అయినా, ప్రజలకి ఆ నటుడి గురించి తెలియాలంటే కొంచెం ప్రజల్లోకి తీసుకెళ్లే సత్తా వున్న స్టార్ కావాలి. మరి ఇప్పుడు ఆ స్టార్ కోవిడ్ బారిన పడ్డాడు. మహేష్ ప్రమోషన్స్ ఎలా చేస్తారో చూడాలి. మహేష్ తన వంతు సాయంగా సోషల్ మీడియాలో ప్రమోట్ చేయవచ్చు.