ప్రభాస్ రాధేశ్యామ్ ఈ నెల 14 న గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవ్వాల్సింది.. లాస్ట్ మినిట్ లో మేకర్స్ రాధేశ్యామ్ మూవీని పోస్ట్ పోన్ చేసారు. ఓమైక్రాన్ కేసులు పెరిగిపోతుండటం, థియేటర్స్ 50 ఆక్యుపెన్సీ తో నడవడం, పలు రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూలతో రాధేశ్యామ్ వాయిదా పడింది. అయితే ఇప్పుడు రాధేశ్యామ్ మూవీకి కొత్త డేట్ సెట్ చేస్తున్నారనే టాక్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మార్చి 19 న రాధేశ్యామ్ రిలీజ్ కి మేకర్స్ డేట్ చూసుకుంటున్నారని అంటుంటే.. రాధేశ్యామ్ కి ఓటిటి నుండి బిగ్ డీల్ వచ్చింది.. కానీ మేకర్స్ ఒప్పుకోవడం లేదు అంటున్నారు.
నిజానికి రాధే శ్యామ్ మేకర్స్ ఇప్పుడు కొత్త డేట్ ని ఆలోచించే స్థితిలో లేరు. కారణం కరోనా ఎప్పటికి తగ్గి.. ఎప్పుడు 100 పర్సెంట్ ఆక్యుపెన్సీ థియేటర్స్ నడుస్తాయో ఎవ్వరూ చెప్పలేరు. కాకపోతే రాధేశ్యామ్ మూవీకి సల్మాన్ రాధే లాగా.. 50- పర్సెంట్ అక్యుపెన్సీతో థియేటర్స్ లో రిలీజ్ అవడం అదే టైం లో ఓటిటిలో రిలీజ్ అయ్యేలా ఓ బిగ్ డీల్ అయితే రాధేశ్యామ్ దగ్గరికి వచ్చిందట. కానీ ప్రభాస్ తో పాటుగా నిర్మాతలు కూడా రాధే శ్యామ్ బిగ్ స్క్రీన్ మీదే చూడాలి. అందుకే ఓటిటికి అమ్మేది లేదంటున్నారట.