Advertisement
Google Ads BL

తమిళ సినిమాలు హోల్సేల్ వాయిదాలు


పాన్ ఇండియా లో విడుదల కావాల్సిన ఆర్.ఆర్.ఆర్ మూవీ, రాధేశ్యామ్ మూవీలు కరోనా కేసులు పెరుగుతుండడం వలన.. విడుదల చేసే పరిస్థితి లేకపోవడంతో వాయిదాలు పడ్డాయి. అదే టైం లో టాలీవుడ్ లో చిన్న సినిమాలు పండగకి రావడానికి ఉత్సాహం చూపిస్తున్నాయి. మరోపక్క తమిళనాట అజిత్ నటించిన వాలిమై మూవీ ని బోనికపూర్ ఎట్టి పరిస్థితిల్లో పొంగల్ రిలీజ్ అంటూ హడావిడి చెయ్యడం, ప్రమోషన్స్ చెయ్యడం చూస్తున్నాం. విజయ్ దేవరకొండ తో, నాగ చైతన్యతో వాలిమై పోస్టర్స్ ని రివీల్ చేయించారు మేకర్స్. అనుకోకుండా అనూహ్యంగా తమిళ హీరో విశాల్ సామాన్యుడు కూడా పొంగల్ రిలీజ్ అంటూ డేట్ ప్రకటించారు.

Advertisement
CJ Advs

తీరా చూస్తే తమిళనాడు సీఎం స్టాలిన్.. తమిళనాడులో ఆదివారం లాక్ డౌన్, నైట్ కర్ఫ్యూలు పెట్టడంతో.. ఇప్పుడు తమిళ హీరోలంతా హోల్సేల్ గా తమ సినిమాలను పోస్ట్ పోన్ చేసుకున్నారు. అజిత్ వాలిమై మూవీ ని పోస్ట్ పోన్ చేస్తున్నామంటూ అఫీషియల్ గా ప్రకటన ఇచ్చారు. అలాగే విశాల్ సామాన్యుడు పొంగల్ రేస్ నుండి తప్పుకుని జనవరి 26 అంటే రిపబ్లిక్ డే కి డేట్ మార్పు చేసేసారు. అంటే జనవరి 26 కి పరిస్థితులు చక్కబడతాయనుకుని విశాల్ కాస్త ముందుగా సామ్సన్యుడికి డేట్ లాక్ చేసేసాడేమో అంటున్నారు.  

Tamil movies wholesale postponed:

<span>Ajith Valimai and VIshal Samanyudu postponed</span>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs