Advertisement
Google Ads BL

డిజె టిల్లు లాలాగూడా అంబర్ పేట సాంగ్


లాలాగూడా అంబర్ పేట మల్లేపల్లి మలక్ పేట అంటూ పాటందుకున్న డిజె టిల్లు సిద్దు జొన్నలగడ్డ, 

Advertisement
CJ Advs

గాయకుడు రామ్ మిరియాల స్వరాన్ని, స్వరాల్ని అందించిన గీతం

సిద్ధు జొన్నలగడ్డ హీరోగా, నేహాశెట్టి నాయికగా టాలీవుడ్ లోని  ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్ మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం డిజె టిల్లు. 

ఈ చిత్రానికి సంభందించిన ఓ గీతం ఈ రోజు విడుదల అయింది. గాయకుడు రామ్ మిరియాల స్వయంగా ఆలపిస్తూ, స్వరాలు సమకూర్చిన ఈ గీతం విడుదల ఆయన క్షణం నుంచే చార్ట్ బస్టర్ లో దూసుకు వెళుతోంది. సామాజిక మాధ్యమాలలో సైతం స్పందన డీజే స్థాయిలో హోరెత్తుతోంది. పాట వివరాలు, విశేషాలలోకి వెళితే.....

లాలాగూడా అంబర్ పేట మల్లేపల్లి మలక్ పేట

టిల్లు అన్న డీజే పెడితే డిల్లా డిల్లా ఆడాల

మల్లేశన్న దావత్ ల బన్ను గాని బారాత్ ల

టిల్లు అన్న దిగిండంటే డించక్ డించక్ దుంకాల అనే ఈ పల్లవి గల గీతాన్ని గీతా రచయిత కాసర్ల శ్యామ్ రచించారు. ఈ గీతం గురించి ఆయన మాటల్లోనే...

హీరో క్యారెక్టరైజేషన్ చెప్పే ఒక పాట రాయాలని డైరెక్టర్ గారు చెప్పి,రామ్ మిరియాల ఇచ్చిన మంచి బీట్ ఉన్న ట్యూన్ పంపించారు...పక్కా హైదరాబాదీ రిదం తో ఉన్న ట్యూన్ వినగానే బాగా నచ్చింది.. హైదరాబాద్ గల్లీలల్లో  ఒక రకమైన ఆటిట్యూడ్ తో ఉండే యంగ్ కుర్రాళ్ళు గుర్తొచ్చారు..ఏరియాల పేర్లతో పల్లవి ప్రారంభించి,హీరోపై మిగతా మిత్రులు, ఫ్యాన్స్ కోణంలో హుక్ లైన్ రాసా..తరువాత టీజర్ లో హీరో నటన,స్వాగ్ చూసాక చరణం అప్రయత్నంగా పలికింది... పాట ప్రోమోనే అద్భుతమైన వ్యూస్ రాబట్టుకుంది.. పాట అందరినీ ఆకట్టుకుంటుందని నమ్ముతున్నాను...

మంచి డాన్సింగ్ నంబర్ నా కలం లో నుండి రావడం,అందరి సెలెబ్రేషన్ లలో నేను ఒక భాగమవ్వడం సంతోషం గా ఉందని ఈ గీతం రచయిత కాసర్ల శ్యామ్ అంటున్నారు. భాను నృత్యరీతులు సమకూర్చారు ఈ గీతానికి. 

ఇప్పటివరకు ఈ చిత్రానికి సంభందించి విడుదల అయిన ప్రచార చిత్రాలు, ఇటీవల విడుదల అయినడిజె టిల్లు టీజర్ కూడా పూర్తిగా యువతరాన్ని ఆకట్టుకున్నాయన్నది స్పష్టం. అటు టీజర్ లో దృశ్యాలు, సంభాషణలు ఇటు ఈ గీతంలోని నృత్యాలు ఆ విషయాన్ని స్పష్టం చేశాయి. జనవరి 14-2022 న విడుదల అవుతున్న డిజె టిల్లు ప్రేక్షకుల్లోఆసక్తిని రేకెత్తిస్తోంది అనటంలో ఎంతమాత్రం సందేహం లేదు అనే విధంగా చిత్ర ప్రచారం ముమ్మరంగా జరుగుతోంది. 

DJ Tillu for Tillu Anna DJ Pedithe :

Come, shake a leg with DJ Tillu for Ram Miriyala groovy dance number Tillu Anna DJ Pedithe 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs