Advertisement
Google Ads BL

ఆచార్య పై అభ్యంతరాలు


మెగాస్టార్ చిరంజీవి - కొరటాల కాంబోలో తెరకెక్కిన ఆచార్య మూవీ ఫిబ్రవరి 4 న రిలీజ్ కి రెడీ అవుతుంది. భారీ అంచనాలతో రాబోతున్న ఈ సినిమా మల్టీస్టారర్ గా తెరకెక్కింది. రామ్ చరణ్ కూడా ఆచార్య లో భాగమవడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అయితే ఆచార్య మూవీ నుండి ఒక్కో సాంగ్ వదులుతూ హైప్ క్రియేట్ చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే రెండు సాంగ్స్ తో పాటుగా ఒక ఐటెం సాంగ్ ని రిలీజ్ చేసారు. రీసెంట్ గా రిలీజ్ చేసిన శానా కష్టం ఐటెం సాంగ్ అందరిని ఆకట్టుకుంది. రెజినా కాసాండ్రా - చిరు కలయికలో ఈ సాంగ్ తెరకెక్కింది.

Advertisement
CJ Advs

అయితే ఇప్పుడు ఆచార్య సినిమాలోని శానా కష్టము సాంగ్ తమ మనోభావాలను దెబ్బతీసేలా ఉందంటూ జనగామ ఆర్ఎంపీ డాక్టర్స్ సంఘం ఆరోపిస్తుంది. ఈ సాంగ్ లోని ఏడేడో నిమరొచ్చని కుర్రాళ్లే ఆర్ఎంపీలు అవుతున్నారే లిరిక్స్ తమని, తమ వృత్తిని కించపరిచేవిలా ఉన్నాయంటూ ఆర్‌ఎంపీల సంఘం రాష్ట్ర కార్యనిర్వాహణ అధ్యక్షుడు పసునూరి సత్యనారాయణ.. జనగామ పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చెయ్యడం కలకలం సృష్టించింది. ఆ పాటను తొలగించడం లేదంటే.. ఆ లిరిక్స్ తీసెయ్యాలనంటూ వారు డిమాండ్ చేస్తూ దర్శకుడు కొరటాలపై ఫైర్ అవుతున్నారు.

Police Complaint Against Chiranjeevi Acharya Song:

Acharya song lands in trouble, complaint lodged
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs