Advertisement
Google Ads BL

చరణ్, జక్కన్నలను వంటలతో పోల్చిన ఎన్టీఆర్


ఆర్.ఆర్.ఆర్ సినిమా రిలీజ్ తో థియేటర్స్ దగ్గర సందడి కనబడాల్సి పోయి.. ఇప్పుడు ఆర్.ఆర్.ఆర్ వాయిదాతో ఫాన్స్ ఉసూరుమంటున్నారు. కరోనా హోల్సేల్ గా ఆర్.ఆర్.ఆర్ టీం తో పాటు ఫాన్స్ కి భారీ షాకిచ్చింది. లేదంటే ఈపాటికి ఎన్టీఆర్, రామ్ చరణ్ ఆర్.ఆర్.ఆర్ కటౌట్స్ కళకళలాడేవి. మరి ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ ఉత్సాహంలో రాజమౌళి సినిమా ప్రమోషన్స్ ఎన్ని విధాలా చెయ్యాలో అన్ని విధాలా చేసి.. అదరగొట్టేసాడు. సినిమా పోస్ట్ పోన్ అయిన.. ఇక ఇంకా ఆర్.ఆర్.ఆర్ గురించి మాట్లాడుకునేలా చేసారు. తాజాగా బాలీవుడ్‌ నటి సాహెబా బాలీ ఇంటర్వ్యూలో భాగంగా ఎన్టీఆర్ సాహెబా బాలీ కి హైదెరాబాదీ రుచులని పరిచయం చేసాడు. సాహెబా బాలీ హైదరాబాద్ బిర్యానీ తో పాటుగా తెలంగాణ చేపల పులుసు అలాగే గుంటూరు చికెన్ తో సర్ ప్రైజ్ చేసాడు

Advertisement
CJ Advs

ఇక ఇంటర్వ్యూలో భాగంగా మీరు పులితో ఫైట్ చేశారంటగా అని సాహెబా బాలీ అడగగా.. ఏమో అయ్యుండొచ్చు.. కాకపోవచ్చు అంటూ ఎన్టీఆర్ కన్ఫ్యూజ్ చేసాడు. అయితే ఆర్.ఆర్.ఆర్ టీంలో ఎవరు ఎలా ఉంటారు.. వారిని చక్కటి వంటలతో ఎన్టీఆర్ చాలా చక్కగా పోల్చడం ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. రాజమౌళి బిర్యానీ లాంటి వారని.. బిర్యానీ చెయ్యడానికి చాలా రకాల వస్తువులు కావాలని, చాలా పర్ఫెక్ట్ గ ఉండాలని, చూడడానికి సింపుల్ గా ఉన్నా.. పని విషయంలో రాజమౌళి పర్ఫెక్ట్ అన్నాడు.

ఇక రామ్ చరణ్ ని పని పూరితో పోల్చాడు ఎన్టీఆర్. పానీ పూరి నోట్లో వేసుకోగానే.. కరిగిపోయినట్లుగా.. చరణ్ చాలా స్వీట్ గా ఉంటాడని.. క్లోజ్ అయితే అన్ని విషయాలు పంచుకుంటాడని చెప్పిన ఎన్టీఆర్ అలియా భట్ ని ఇరానీ బన్‌ మస్కా తో పోల్చాడు. ఇరానీ బన్‌ మస్కా చాలా స్పెషల్ అని, చాలా హెల్దీ అని.. అలానే అలియా భట్ ఉంటుంది అని చెప్పాడు. 

ఇక అజయ్ దేవగన్ ని వడా పావ్‌ తో పోల్చాడు. వడా పావ్‌ ముంబయి లోకల్‌ ఫుడ్‌ అని, ముంబై లోని వారికి ఇది కచ్చితంగా ఉండాల్సిందే. వడా పావ్‌లా అజయ్‌ దేవ్‌గణ్‌ అందరికీ కావాలి అంటూ ఇంట్రెస్టింగ్ గా చెప్పాడు ఎన్టీఆర్.

NTR Join Sahiba Bali Interview:

RRR Heroes NTR and Ram Charan Join Sahiba Bali
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs