Advertisement
Google Ads BL

పేర్ని నాని ట్వీట్ - ఆర్జీవీ కౌంటర్


గత రెండు రోజులుగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. ఏపీ ప్రభుత్వాన్ని ట్వీట్స్ తో చీల్చి చెండాడుతున్నాడు. టాలీవుడ్ ప్రముఖులంతా ఏపీ టికెట్ రేట్స్ విషయంలో ఓ ట్వీట్ వేసి సైలెంట్ అవ్వగా.. ఆర్జీవీ మాత్రం.. ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానిని ట్వీట్ల వర్ధంతో తడిపేస్తున్నారు. అటు పేర్ని నాని కూడా ఆర్జీవీ కి రిప్లై ఇస్తున్నారు.. ఇలా ట్వీట్స్ వార్ ఓ రేంజ్ లో ఉంది. తాజాగా పేర్ని నాని ట్వీట్స్ కి కౌంటర్ గా రామ్ గోపాల్ వర్మ..

Advertisement
CJ Advs

నాని గారు..చాలా మంది లీడర్ల లా పరుష పదజాలం తో మాట్లాడకుండా డిగ్నిటీ తో సమాధానం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండీ..ఇక విషయానికి వస్తే వంద రూపాయల టికెట్ ని వెయ్యికి అమ్ముకోవచ్చా? అన్నది క్వశ్చన్ కాదండీ ..అది అమ్మేవాడి నమ్మకం..కొనేవాడి అవసరం బట్టి ఉంటుంది

మీరు ఎడారి లో నీళ్ళు లేని పరిస్థితి లో ఉన్నప్పుడు గ్లాస్ నీళ్ళు 5 లక్షలకి కొనచ్చు

కానీ అది పరిస్థితిని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు అనుకుంటే మార్కెట్ అనేది ఉన్నదే దానికి .. కార్ కావాలనే కోరికని ఎక్స్ప్లాయిట్ చెయ్యడానికే రకరకాల లగ్జరీ కార్లు తయారు చేసి ఆకర్షిస్తారు

అది తప్పని గవర్నమెంట్ వాటికి అడ్డు కట్ట వేస్తే మనం ఇప్పటికీ కాలి నడకన తిరుగుతూ ఉండేవాళ్ళం

ముడి పదార్థం 500 రూపాయలు కూడా ఖర్చవ్వని ఒక పెయింటింగ్ ని ,కొనేవాడుంటే 5 కోట్లకి అమ్ముతారు

ముడి పదార్థానికి మాత్రమే వాల్యూ ఇస్తే దాంట్లో ఉన్న బ్రాండ్ కి, ఐడియా కి ఎలా వెల కడతారు?

క్వాలిటీ ఆఫ్ లైఫ్ అడ్వాన్స్మెంట్ అనేది కంటిన్యువస్ గా అన్ని వస్తువులు ఇంకా, ఇంకా బెటర్ గా ఉండేలా ప్రయత్నించడం ..బెటరా అవునా కాదా అనేది కొనుగోలుదారుడు నిర్ణయిస్తాడు.

కొనేవాడికి అమ్మేవాడికి మధ్య ట్రాన్సాక్షన్ ఎంతకి జరిగిందనే ట్రాన్స్పరెన్సీ మాత్రమే ప్రభుత్వాలకి అవసరం ..ఎందుకంటే వాళ్ళకి రావాల్సిన టాక్స్ కోసం.

బ్లాక్ మార్కెటింగ్ అనేది గవర్నమెంట్ కి తెలియకుండా చేసే క్రైమ్ ..ఓపెన్ గా ఎంతకి అమ్ముతున్నాడో చెప్పి అమ్మితే అది తప్పెలా అవుతుంది

ఉదాహరణకి మీకు తెలుసో తెలియదో బాంబే ఢిల్లీ లలో వీక్ డే బట్టి, థియేటర్ బట్టి, ఏ సినిమా అనేదాన్ని బట్టి టికెట్ ప్రైజ్ లు 75 రూపాయల నుండి 2200 రూపాయల వరకూ వేరీ అవుతాయి

వీటన్నింటినీ నియంత్రించేది కేవలం ఓల్డెస్ట్ ఎకనామిక్ థియరీ డిమాండ్ అండ్ సప్లై

గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ అనేది కొన్ని విపరీత పరిస్థితుల్లో బియ్య0 గోధుమ etc లాంటివి ఉత్పత్తి ఎక్కువయిపోయి ధర చాలా పడిపోయినప్పుడు కానీ ఉత్పత్తి తక్కువయిపోయి ధర విపరీతంగా పెరిగిపోయినప్పుడు కానీ ఉంటుంది. అలాంటి విపరీత పరిస్థితి ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ లో కానీ ప్రేక్షకుల లో కానీ ఎక్కడ వచ్చిందండీ?

లూటీ అనే పదం ఉపయోగించేది బలాన్ని ఉపయోగించి క్రిమినల్ గా లాక్కున్నప్పుడు ...అమ్మేవాడు కొనేవాడు పరస్పరం అంగీకరించుకుని చేసుకునే దాన్ని ట్రాన్సాక్షన్ అంటారు ...ఆ ట్రాన్సాక్షన్ లీగల్ గా జరిగినప్పుడు గవర్నమెంట్ వాటా టాక్స్ రూపంగా తానంతట తనే వస్తుంది

థియేటర్లనేవి ప్రజా కోణం లో వినోద సేవలందించే ప్రాంగణాలు అని చెప్పారు. అలా అని మీకు ఏ ప్రజలు చెప్పారో వాళ్ల పేర్లు చెప్పగలరా? లేకపోతే రాజ్యాంగం లో కానీ సినిమాటోగ్రఫీ యాక్ట్ లో కానీ ఈ డెఫినిషన్ ఉందా? మీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలని సమర్థించుకోవటానికి, ఆ డెఫినిషన్ మీకు మీరు ఇచ్చుకుంటున్నారు.. 

థియేటర్లనేవి , జూన్ 19 1905 న నికెలోడియోన్ అనే ప్రపంచం లోనే మొట్ట మొదటి థియేటర్ అమెరికా లో పెట్టినప్పటి నుంచి ఈనాటి వరకూ  అవి కేవలం బిజినెస్ కోసం పెట్టిన వ్యాపార సంస్థలు..అంతే కానీ ప్రజా సేవ నిమిత్తం ఎప్పుడూ ఎవ్వరూ పెట్టలేదు..కావాలంటే మీ గవర్నమెంట్ లో ఉన్న థియేటర్ ఓనర్లని అడగండి

సొసైటీ ఆధునీకతకి ముఖ్య కారణం మోటివేషన్..ఎందుకంటే ప్రతి మనిషి కూడా మానవ సహజంగా తను ఉన్న పొజిషన్ కన్నా పైకి ఎదగాలని కోరుకుంటాడు .. పేదవాడు ధనికుడవ్వాలని కోరుకుంటాడు, సైంటిస్ట్ ఎవ్వరూ కనిపెట్టలేనిది కనిపెట్టాలనుకుంటాడు .మీ పార్టీ కార్యకర్త మీలా మంత్రి అవ్వాలని కోరుకుంటాడు .. మీ ముఖ్యమంత్రి ప్రధాన మంత్రి అవ్వాలని కోరుకుంటాడు..

అలా కోరుకునేది అందరి కన్నా బెటర్ అవ్వాలనే ఒక మోటివేషన్ తో..ఆ బెటర్ గా ఉన్నప్పుడు వచ్చే అదనపు సౌఖ్యాలని కట్ చేసినప్పుడు మనిషికి మోటివేషన్ పోతుంది.. కమ్యూనిజం ఘోరంగా ఫెయిల్ అయ్యింది అక్కడే

V EPIC థియేటర్ లో ఉన్న సౌకర్యాలను చూడకుండా ఆ థియేటర్ ఉన్న ఏరియా బట్టి టికెట్ ప్రైజ్ ఎలా పెట్టారు? 

వివిధ హోటల్సు లో ఆ ఆ హోటల్ వాళ్ళు వాళ్ళిచ్చే సౌకర్యాలను బట్టే ప్రైజ్ లిస్ట్ పెట్టుకుంటారు 

పవన్ కళ్యాణ్ సినిమాకి సంపూర్ణేష్ బాబు సినిమాకి మీ ప్రభుత్వం లో తేడా లేనప్పుడు మంత్రిగా మీకు, మీ డ్రైవర్ కి కూడా తేడా లేదా?

పేదల కోసం చెయ్యడం అనే మీ ఉద్దేశం మంచిది కావచ్చు..కానీ దానికోసం  పేదల్ని ధనికుల్ని చెయ్యటానికి మీ ప్రభుత్వం పని చెయ్యాలి కానీ ఉన్న దనికుల్ని పేదల్ని చెయ్యకూడదు..అలా చేస్తే ఆంధ్రప్రదేశ్ ఇండియాలో కల్లా పేద రాష్ట్రం అయ్యే ప్రమాదముంది.

నానీ గారు నేను ఒక యావరేజ్ ఇంజినీరింగ్ స్టూడెంట్ ని.. ఎకనామిక్స్ గురించి నాకు 

ఏ బీ సీ డీ కూడా తెలియదు..కానీ మీరు అనుమతిస్తే మీ ప్రభుత్వం లో ఉన్న టాప్ ఎకనామిక్స్ ఎక్స్పర్ట్ తో నేను టీవీ డిబేట్ కి రెడీ..మా సినిమా ఇండస్ట్రీ కి మీ ప్రభుత్వానికి మధ్య ఏర్పడ్డ ఈ మిసండర్స్టాన్డింగు తొలగిపోవడానికి ఇది చాలా అవసరం అని నా అభిప్రాయం.. థ్యాంక్యూ

Perni Nani tweet-RGV counter tweet:

Ap minister Perni Nani replies to Ram Gopal Varma tweets 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs