Advertisement
Google Ads BL

అఫీషియల్: రాధే శ్యామ్ పోస్ట్ పోన్


అనుకున్నదే అయ్యింది.. ప్రభాస్ రాధేశ్యామ్ జనవరి 14 నుండి వెనక్కి తగ్గింది. నిన్నటివరకు ఎట్టి పరిస్థితుల్లో రాధే శ్యామ్ సంక్రాంతికే రిలీజ్ అంటూ ప్రచారం జరగడం కాదు.. మేకర్స్ పిఆర్ టీం తో సోషల్ మీడియాలో పోస్ట్ లు చేయించారు. అదేమిటి ఓమ్రికాన్ వేరియెంట్ రోజు రోజుకి పెరుగుతున్న తరుణంలో రాధే శ్యామ్ జనవరి 14 న రిలీజ్ అంటున్నారని కన్ఫ్యూజన్ అందరిలో ఉన్నప్పటికీ.. రేపో మాపో అఫీషియల్ గా రాధేశ్యామ్ పోస్ట్ పోన్ ప్రకటన వస్తుంది అనుకున్నారు. గత వారం రోజులుగా అంటే ఆర్.ఆర్.ఆర్ మూవీ పోస్ట్ పోన్ అన్నదగ్గరనుండి రాధే శ్యామ్ ప్రమోషన్స్ ఆపేసారు మేకర్స్. ఎందుకంటే సినిమాని పోస్ట్ పోన్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారు. అన్ని సెట్ అయ్యి జనవరి 14 న రాధే శ్యామ్ వచ్చేస్తుంది అనుకుని ప్రభాస్ ఫాన్స్ సంతోషపడినా ఓమ్రికాన్ వేరియెంట్ ప్రభాస్ ఫాన్స్ ఆశలపై నీళ్లు చల్లింది.

Advertisement
CJ Advs

తాజాగా మేకర్స్ రాధే శ్యామ్ ని పోస్ట్ పోన్ చేస్తున్నట్టుగా అధికారికంగా ప్రకటించారు. లవ్ vs డెస్టినీ రాధే శ్యామ్ చూడడానికి మరికొంతకాలం వెయిట్ చెయ్యండి, ప్రస్తుతం కొనసాగుతున్న కోవిడ్ పరిస్థితుల కారణంగా మా సినిమా రాధేశ్యామ్ విడుదలను వాయిదా వేయవలసి వచ్చింది. రాధే శ్యామ్ కోసం వేచి చూస్తున్న ఫాన్స్ కి హృదయపూర్వక ధన్యవాదాలు.. త్వరలో సినిమాల్లో కలుద్దాం..! అంటూ ట్వీట్ చేసారు. కోవిడ్ పరిస్థితులు అనుకూలించాక రాధే శ్యామ్ రిలీజ్ డేట్ ప్రకటిస్తామని మేకర్స్ ట్వీట్ చేసేసరికి ప్రభాస్ ఫాన్స్ డిస్పాయింట్ అవుతున్నారు.

Official: Radhe Shyam Postponed again:

Prabhas Radhe Shyam Postponed due to Covid19
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs