Advertisement
Google Ads BL

రెండున్నర ఏళ్ళ తరువాత అనుపమ సినిమా


అనుపమ పరమేశ్వరన్ మంచి టాలెంట్ వున్న నటీమణుల్లో ఒకరు. తెలుగులో ఆమెకి వచ్చిన అవకాశాలను అంది పుచుకుని, తాను మంచి పెరఫార్మర్ అని అనిపించుకుంది. అయితే ట్రెడిషనల్ హీరోయిన్ అని ముద్రపడిందో.. లేదంటే ఆ హీరోయిన్ కి లక్కు లేదో కానీ.. రంగస్థలం లో చరణ్ పక్కన రామలక్ష్మి పాత్ర చేజారిన తర్వాత.. ఇప్పుడు చిన్న యాక్టర్స్ తో తెలుగులో సినిమాలు చేస్తోంది. తన తదుపరి సినిమాలు కార్తికేయ లో నిఖిల్ తోనూ, రౌడీ బాయ్స్ ఆశిష్ తో రొమాన్స్ చేస్తుంది. దిల్ రాజు అన్న కొడుకు ఆశిష్ హీరోగా పరిచయం అవుతున్న రౌడీ బాయ్స్ లో కథానాయికగా నటించింది. ఇది కాలేజీ నేపధ్యం వున్న సినిమా. 

Advertisement
CJ Advs

మొదట ఈ సినిమాని మార్చ్ లో అలా రిలీజ్ చేద్దాం అనుకున్నారు కానీ.. ఇప్పుడు ట్రిపిల్ ఆర్ పోస్టుపోన్ అవటం తో దిల్ రాజు హడావిడిగా ఈ సినిమాని సంక్రాంతి కి తీసుకు వచ్చాడు. ఇది అనుపమ కి రెండున్నర ఏళ్ళ  తరువాత వస్తున్న సినిమా. ఇంతకు ముందు అనుపమ నటించిన రాక్షసుడు 2019 లో విడుదల కాగా, మళ్ళీ ఇన్నాళ్ళకి ఆమె తెలుగు సినిమా రౌడీ బాయ్స్ రిలీజ్ అవుతోంది. ఇంస్టాగ్రామ్ లో ఎప్పుడూ హడావిడిగా ఉంటూ, ఎక్కువమంది ఫాలోవర్స్ వున్న అనుపమ ఈమధ్యన గ్లామర్ డాల్ గా గెటప్ మార్చిన ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. మరి అనుపమకు ఈ సంక్రాంతి పాండా ఎలా ఉండబోతోందో మరో వారం రోజుల్లోనే తెలిసిపోతుంది.

Anupama movie after two years:

Anupama Parameswaran Rowdy Boys to release on Jan 14
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs