రీసెంట్ గా చిరంజీవి ఆచార్య మూవీ నుండి ఓ ఐటెం సాంగ్ ని రిలీజ్ చేసారు. శానా కష్టం అంటూ ఆ సాంగ్ లో గ్లామర్ గర్ల్ రెజినా మెగాస్టార్ చిరు తో కలిసి చిందులు వేసింది. శానా కష్టం ఐటెం సాంగ్ కి మణి శర్మ మ్యూజిక్ ప్లస్ అయ్యింది. ఆ సాంగ్ రిలీజ్ అయిన గంటల్లోనే సూపర్ హిట్ అయ్యింది.. సాంగ్ క్లిక్ అయ్యింది.. కానీ మెగా ఫాన్స్ ఆ కిక్ ని ఎంజాయ్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే.. ఈ మధ్యన స్టార్ హీరోలు తమ సినిమాల్లో ఐటెం సాంగ్స్ చేయించడానికి స్టార్ హీరోయిన్స్, గ్లామర్ హీరోయిన్స్ ని తెచ్చుకుంటున్నారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ కోసం అప్పటి టాప్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ తో పక్కా లోకల్ స్టెప్స్ వేయించారు. అలాగే మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూ మూవీ కోసం మిల్కి బ్యూటీ తమన్నాకి తీసుకొచ్చారు. ఇక రామ్ చరణ్ రంగస్థలం మూవీ కోసం టాప్ హీరోయిన్ పూజ హెగ్డే తో ఊర మాస్ స్టెప్స్ తో జిల్ జిల్ జిగేలు రాణి అంటూ ఇరగదీసారు. ఇక రీసెంట్ గా అల్లు అర్జున్ కూడా పుష్ప సినిమా కోసం ఏకంగా సమంత ని తీసుకువచ్చారు. ఇప్పటికీ సమంత-బన్నీ ఊ అంటావా మావ ఉ ఊ అంటావా మావ ఐటెం సాంగ్ ఊపేస్తోంది.
కానీ మెగాస్టార్ లాంటి పెద్ద హీరో పక్కన రెజినా ఏంటి.. ఆ అమ్మాయి చిరు పక్కన తేలిపోయింది. చిరు పక్కన రెజినా కనిపించలేదు, ఆమె గ్లామర్ సరిపోలేదు... ఎంత చూపించినా కిక్ ఇవ్వలేదు.. అందుకే సాంగ్ హిట్ అయినా.. ఆ కిక్ ని ఫాన్స్ ఎంజాయ్ చేయలేకపోతున్నారు. మెగాస్టార్ ఇమేజ్ కి తగ్గట్టుగా.. ఫామ్ లో ఉన్న వారిని ఎవరినైనా పెట్టుంటే బావుండేది అనేది ఫాన్స్ ఫీలింగ్. మరి దీనికి తోడు చిరు మరో మూవీ భోళా శంకర్ లోనూ జబర్దస్త్ రష్మీ తో ఐటెం సాంగ్ అంటున్నారు. చిరంజీవి రేంజ్ కి ఆయన పక్కన చేయాల్సిన హీరోయిన్స్ ఎవరు.. దర్శకులు ఎంచుకున్న హీరోయిన్స్ ఎవరు.. ఈ విషయంలో ఫాన్స్ డిస్పాయింట్ అవుతున్నారనే విషయాన్ని చిరు తో సినిమాలు చేసే డైరెక్టర్స్ గుర్తుపెట్టుకోవాలి.