బిగ్ బాస్ సీజన్ 5 లో ఎక్కువ నెగెటివిటి మూట గట్టుకుని బయటికి వచ్చిన జంట షణ్ముఖ్ ఇంకా సిరి. వీరిద్దరూ బిగ్ బాస్ హౌస్ లో చేసిన రచ్చ తో అటు ఫాన్స్ కి యాంటీ అయ్యారు. అటు ప్రేమించిన వాళ్ళకి దూరమయ్యారు. ఇప్పటికే షణ్ముఖ్ గర్ల్ ఫ్రెండ్ దీప్తి సునయన బ్రేకప్ ప్రకటించగా.. ఇప్పుడు అందరి చూసి సిరి ప్రేమించిన శ్రీహన్ మీదే ఉంది. దీప్తి సునయన బిగ్ బాస్ లో షణ్ముఖ్ చేసిన పనులకి విసిగిపోయి.. అతను బయటికి రాగానే బ్రేకప్ చెప్పి షాకిచ్చింది. ఇక సిరి - శ్రీహన్ కి ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. సిరి హౌస్ నుండి బయటికి వచ్చాక శ్రీహన్ తో కలిసి ఒక్కసారి కూడా కనిపించలేదు. అలాగే శ్రీహన్ పెళ్లి ఎప్పుడు అంటే అప్పుడే అన్న సిరి.. కెరీర్ ఇప్పుడే స్టార్ట్ అయ్యింది అంటూ పెళ్లి ఇప్పుడెందుకులే అన్నట్టుగా మాట్లాడింది.
ఇక సిరి పుట్టిన రోజునాడు శ్రీహన్ ఇన్స్టా లో పోస్ట్ పెట్టాడు. హ్యాపీ బర్త్ డే సిరి.. ఈ ఏడాది నీకు పాజిటివ్ వైబ్స్ తో సాగాలని కోరుకుంటున్నాను.. నీ లక్ష్యాలని త్వరలోనే సాధిస్తావ్ అంటూ సిరిని విష్ చేసాడు. అయితే శ్రీహన్ కూడా త్వరలోనే సిరికి బ్రేకప్ చెప్పెయ్యబోతున్నాడనే న్యూస్ మాత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. షణ్ముఖ్ - దీప్తి సునయన కేవలం సిరి వలనే విడిపోయారని, ఇప్పుడు శ్రీహన్ గనక సిరికి బ్రేకప్ చెబితే.. ఆ బ్రేకప్ కి కారణం షణ్ముఖే అవుతాడని అంటున్నారు. ఏది ఏమైనా సినిమా జంటలు విడిపోయినప్పుడు ఉన్నంత క్యూరియాసిటీ, ఆత్రుత ఇప్పుడు బుల్లితెర జంటలు విడిపోయినప్పుడు కూడా నెటిజెన్స్ కి వచ్చేస్తుంది.