మహేష్ బాబు సర్కారు వారి పాట ఇంకా చెయ్యాల్సిన షూటింగ్ చాలా వుంది అంటున్నారు. మహేష్ బాబు సంక్రాంతి కి తన సినిమా రిలీజ్ చేస్తా అని ముందుగా ప్రకటించి, తరువాత మళ్ళీ ట్రిపిల్ ఆర్ కోసం, తాను పోస్టుపోన్ చేసుకున్నాడు. అయితే ఈ నేపధ్యం లో సినిమా షూటింగ్ చాలామట్టుకు అయిపొయింది అని యూనిట్ సభ్యులు చెపుతున్నా, అస్సలు నిజం ఏంటి అంటే, ఇంకా ఏభయి రోజులు షూటింగ్ వుంది అంటున్నారు. మహేష్ బాబు కాలుకు జరిగిన గాయం వల్ల అతని స్పెయిన్ వెళ్లి శస్త్ర చికిత్స చేయించుకున్న సంగతి తెలిసిందే. దుబాయ్ లో న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ చేసుకొని, సోమవారం ఇండియా కి తిరిగి వచ్చారు.
పూర్తిగా కోలుకున్న మహెష్ బాబు సర్కారు వారి పాట షూటింగ్ లో పాల్గొంటారు. తాజా సమాచారం ప్రకారం, మహేష్ పాత్రకి సంబందించిన షూటింగ్ చెయ్యాల్సింది ఇంకా చాలా ఉందని తెలుస్తుంది. అయితే దర్శకుడు మహేష్ లేని సీన్స్ కొన్ని చిత్రీకరించినా కూడా, ఈ ఫిబ్రవరి చివరికి మిగతా షూటింగ్ అంతా కంప్లీట్ చెయ్యాలని అనుకుoటున్నారు. తరువాత మహేష్.. త్రివిక్రమ్ సినిమా చెయ్యాల్సి వుంది, ఆ తరువాత రాజమౌళి సినిమా చెయ్యాలి.