ట్రిపిల్ ఆర్ పోస్టుపోన్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు అందరి కళ్ళు ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ పైనే వున్నాయి. ఈ సినిమా కూడా పోస్టుపోన్ అవక తప్పదు అంటున్నారు ఇండస్ట్రీ లోని కొంతమంది. అయితే సినిమా నిర్మాతలు మాత్రం తమ పీ ఆర్ ల చేత మా సినిమా పోస్టుపోన్ ఎవ్వడు, మేము సంక్రాంతికి వచ్చేస్తాం అని మెసేజెస్ అయితే పెట్టిస్తున్నారు. కానీ ఇవన్నీ వూరికే మేకపోతు గాంభీర్యం మాత్రమే అంటున్నారు. మరి రిలీజ్ అని చెబుతున్నా సినిమా ప్రమోషన్స్ ఎందుకు ఆపేసినట్టు. ఒక్క ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేసి, ఓ ముగ్గురి టెక్నిషియన్స్ ఇంటర్వూస్ పెట్టారు అంతే. ఆ తరువాత మరెటువంటి ఫంక్షన్ పెట్టలేదు.
ఇది పాన్ ఇండియా ఫిలిం అని మొదటి నుండి చెప్పుకు వచ్చారు కదా. మరి మిగతా భాషల్లో ఒక్క ఈవెంట్ కూడా పెట్టలేదు కదా ఇంతవరకు. దీన్ని బట్టి చూస్తుంటే, రాధే శ్యామ్ కూడా పోస్టుపోన్ అవక తప్పదు. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో ఆంక్షలు విధించారు. అలాగే సినిమా హాళ్లలో కూడా సగం మాత్రమే సీట్స్ ఆక్యుపై చెయ్యాలి అన్నారు. ఇటువంటి సమయంలో రాధే శ్యామ్ కూడా రిలీజ్ అయ్యే పరిస్థితి లేదు. కానీ పోస్ట్ పోన్ ఎప్పుడు ప్రకటిస్తారా.. అని పాన్ ఇండియా ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.