దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ కి మహేష్ బాబు తో సినిమా చెయ్యాలని ఎప్పటి నుండో ఒక కల. ఆ మధ్య ఒకసారి ఛాన్స్ కూడా వచ్చింది అని అంటారు, కానీ అది ఎంతవరకు నిజమో తెలీదు. కానీ ఆయనకి మహేష్ అంటే ఇష్టం, ఆ విషయం అతని సినిమా అష్ట చెమ్మ లోనే తెలిసిపోతుంది. అందులో ఒకరు మహేష్ బాబు అభిమాని. అలా తన అభిమానం కూడా చాటుకున్నారు ఇంద్రగంటి. అయితే అతను సుధీర్ బాబు తో మూడు సినిమాలు వరసగా చేసారు. మూడో సినిమా విడుదలకి రెడీగా కూడా వుంది. ఇంద్రగంటి సుధీర్ బాబుని పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేసాడు. సుధీర్ బాబు లాంటి నటుడుకి మంచి కథలతో రాకపోవటం దర్శకుల తప్పు అని కూడా అనేశాడు.
ఇంతకీ ఇంద్రగంటి ఇంతలా సుధీర్ బాబు ని పొగడవలసిన అవసరం ఏంటి అంటే, మరి సుధీర్ బాబుకి మన మహేష్ బాబు స్వయానా బావ మరిది కదా. రేపు ఎప్పుడయినా ఇంద్రగంటిని మహేష్ బాబు ముందు కూర్చో బెట్టి కథ వినిపించ గలిగేట్టు చెయ్యగల సత్తా సుధీర్ బాబు కి వుంది. అందుకే ఇంద్రగంటి ఇప్పటి నుంచే సుధీర్ బాబు అద్భుత నటుడు అని కితాబు ఇచ్చేస్తున్నారు. సుమారు ఒక పన్నెండు సినిమాలు చేసిన సుధీర్ బాబు అంత పెద్ద పెరఫార్మర్ అయితే, మరి అతని బావ మహేష్ బాబు సంగతి ఏంటో మరి. బావని పొగిడితే బావ ఒప్పేసుకుంటాడా? మరికొంచెం దూరం పెట్టొచ్చు. ఏమైనా టాలెంట్ ఉంటే ఎవరి రికమండేషన్ అవసరం లేదు.