సీనియర్ నటుడు మోహన్ బాబు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ని ఉద్దేశించి ఒక లేఖ రాసి ట్విట్టర్ లో పోస్ట్ చేసారు. అయితే ఇండస్ట్రీ లో వున్న ఎవరూ కూడా ఈ లెటర్ ని సీరియస్ గా తీసుకోలేదని తెలుస్తుంది. ఈ లెటర్ కి సంబంధించి ఇండస్ట్రీ లో ఎవరూ ఇంతవరకు స్పందించలేదు, అస్సలు మోహన్ బాబు ఇప్పుడు ఎందుకు ఇలా లెటర్ రాసారో కూడా అర్థం కాలేదు అని ఒక నిర్మాత అన్నారు. ఇండస్ట్రీ కి చెందిన ఒక టాప్ యాక్టర్ కి, నిర్మాతకి ఫోన్ చేసి మోహన్ బాబు రాసిన లెటర్ మీద మీ స్పందన ఏంటి అని అడిగితే, వాళ్లేమో.. అసలు మోహన్ బాబు ఏమి లెటర్ పెట్టారు ఎక్కడ పెట్టారు అని అడుగుతున్నారు. అంటే ఆ లెటర్ ని అంత సీరియస్ గా తీసుకోలేదు.
అదీ కాకుండా, మోహన్ బాబు కి ఆంధ్ర చీఫ్ మినిస్టర్ చుట్టం అని చెప్పుకు తిరుగుతారు కదా, మరి అలాంటి మోహన్ బాబు ఇలా లెటర్ పెట్టే బదులు, తనే లీడ్ చేయొచ్చు కదా. ఆహా అలా చెయ్యరు, ఎందుకంటే అతని వెనకాల ఎవరు రారు. ఆ మధ్య మోహన్ బాబు కుమారుడు మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ ప్రెసిడెంట్ విష్ణు మా ఎలక్షన్ అప్పుడు తాను రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులను అతి సునాయాసంగా కలవగలను అని అన్నారు కదా. మరి ఇప్పటి వరకు ఎందుకు ఇండస్ట్రీ సమస్య గురించి వాళ్ళతో మాట్లాడలేదు. హడావిడి తప్పితే అక్కడ విషయం లేదన్న సంగతి అందరికి తెలిసిందే. అందుకే మోహన్ బాబు లెటర్ ని ఎవరూ పట్టించుకోలేదు.