Advertisement
Google Ads BL

చిరు - మణి ఐటెం అదుర్స్


మెగాస్టార్ చిరంజీవి - కొరటాల కాంబోలో క్రేజీ మల్టీస్టారర్ తెరకెక్కుతున్న ఆచార్య ఫిబ్రవరి 4 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కి రెడీ అవుతుంది. ఈ మూవీలో రామ్ చరణ్ - పూజ హెగ్డే కూడా నటించడంతో ఆచార్య పై అంచనాలు బాగా పెరిగిపోయాయి. మెగాస్టార్ రెండోసారి క్యూట్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ తో రొమాన్స్ చేస్తున్నారు. ఇక ఆచార్య మూవీ నుండి ఇప్పటికే రిలీజ్ అయిన రెండు పాటలు మార్కెట్ లో క్లిక్ అయ్యాయి. ఇప్పుడు ఆచార్య నుండి పార్టీ సాంగ్ ఐటెం సాంగ్ ని రిలీజ్ చేసింది  టీం. ఈ పార్టీ సాంగ్ లో చిరు తో కలిసి గ్లామర్ హీరోయిన్ రెజినా కాసాండ్రా మాస్ స్టెప్స్ వేసింది.

Advertisement
CJ Advs

మణి శర్మ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో రెజినా - చిరు కలయికలో వచ్చిన ఈ పార్టీ సాంగ్ లిరిక్స్, విజువల్స్ అన్ని అదిరిపోయేలా ఉన్నాయి. అప్పుడెప్పుడో అన్నయ్య సినిమాలో మణిశర్మ - మెగాస్టార్ కాంబోలో ఆట కావాలా పాట కావాలా ఐటెం సాంగ్ అదరగొట్టేసింది. మళ్ళీ ఆ రేంజ్ లో ఇప్పుడు ఆచార్య లోని సానా కష్టం వచ్చేసిందే మందాకిని.. ఐటెం సాంగ్ ఉంది. రెజినా అదిరిపోయే మాస్ స్టెప్స్ తోనూ, అలాగే గ్లామర్ తోనూ రెచ్చిపోయి యూత్ ని పడేసేలా స్టెప్స్ వేసింది. మొదటి సాంగ్ లాహే లాహే, రెండో సాంగ్ నీలాంబరి సాంగ్స్ లా సానా కష్టం వచ్చేసిందే మందాకిని.. ఐటెం సాంగ్ కూడా యూత్ కి బాగా ఎక్కేసేలా మాసివ్ గా కనబడుతుంది. 

Acharya Saana Kastam song released :

<span>Chiranjeevi dazzles in Acharya Saana Kastam song</span>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs