బిగ్ బాస్ ఫేమ్ బిగ్ బాస్ రన్నర్ షణ్ముఖ్ కి బిగ్ బాస్ నుండి బయటికి వచ్చాక భారీ షాక్ తగిలింది. షణ్ముఖ్ ప్రియురాలు దీప్తి సునయన షణ్ముఖ్ కి బ్రేకప్ చెప్పేసింది. ఐదేళ్ల ప్రేమని బిగ్ బాస్ 5 వలనే వదులుకుంటున్నట్టుగా దీప్తి సునయన బ్రేకప్ స్టోరీ ఉంది. దానితో సిరి వలనే దీప్తి సునయన, షణ్ముఖ్ విపోయారంటూ సిరిని సోషల్ మీడియాలో షన్ను, దీపు ఫాన్స్ ట్రోల్ చేస్తున్నారు. సిరి బిగ్ బాస్ హౌస్ లో రెచ్చగొట్టడం వలనే షణ్ముఖ్ అలా ప్రవర్తించాడని, సిరి వలనే దీప్తి సునయన షణ్ముఖ్ కి బ్రేకప్ చెప్పింది అంటూ సిరిని తెగ ట్రోల్ చేస్తున్నారు. సిరి వలనే బిగ్ బాస్ టైటిల్ ని కోల్పోయినట్లుగా షణ్ముఖ్ ఒప్పుకోగా.. ఇప్పుడు ఆ సిరి కారణంగానే షణ్ముఖ్ ఐదేళ్ల ప్రేమని కోల్పోయాడు అంటున్నారు ఫాన్స్.
దానితో దీప్తి - షణ్ముఖ్ ల బ్రేకప్ పై సిరి ఆమె సన్నిహితుల దగ్గర తెగ ఫీలవుతుందట. షణ్ముఖ్ దీప్తి తో విడిపోవడానికి కారణం తాను కాదు అంటుందట. అలాగే దీప్తి సునయన డిసెంబర్ 31 రాత్రి షణ్ముఖ్ కి బ్రేకప్ చెప్పగానే.. సిరి ఎవరైనా మీ దగ్గరకి వచ్చి మీ లైఫ్ చాలా క్లిష్టంగా ఉందే అని కామెంట్ చేస్తే.. వాటి కంటే నేను చాలా స్ట్రాంగ్ అని నవ్వుతూ చెప్పాలనే కోటిషన్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అది షణ్ముఖ్ ని ధైర్యంగా ఉండమని చెప్పడానికే సిరి అలా పోస్ట్ చేసింది అంటున్నారు. అయితే బిగ్ బాస్ హౌస్ లో సిరికీ ఇచ్చిన హగ్గులు, ముద్దుల వలనే దీప్తి సిరిని షణ్ముఖ్ ని అస్యహించుకుంది అని, బిగ్ బాస్ స్టేజి పైన కూడా షణ్ముఖ్ తో మాట్లాడిన దీప్తి సిరితో ఒక్కమాట కూడా మాట్లాడలేదని, అలాగే బిగ్ బాస్ నుండి షణ్ముఖ్ బయటికి వచ్చాక దీప్తి సునయన షణ్ముఖ్ ని ఒక్కసారి కూడా కలవకుండానే బ్రేకప్ చెప్పడం మాత్రం షన్ను, దీపు ఫాన్స్ ఇద్దరూ జీర్ణించుకోలేకపోతున్నారు.