Advertisement

మెగాస్టార్ దానగుణంలో మరో మైలు రాయి


చిరంజీవి మరోసారి తన దాన గుణం చాటుకున్నారు. ఈసారి ఒకరో ఇద్దరికో కాకుండా, మొత్తం తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో వున్న అన్ని క్రాఫ్ట్స్ లో పనిచేస్తున్న అందరికి లైఫ్ టైం హెల్త్ కార్డు లు ఇష్యూ చేసారు. చిరంజీవి ఆధ్వర్యంలో వున్న చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ కార్డులు ఇష్యూ చేసారు. కరోనా మహమ్మారి వల్ల వ్యవస్థలు చిన్నాభిన్నం అయ్యాయి, ఆర్ధికంగా చాలామంది ఛిద్రం అయ్యారు. ఆర్ధికంగా అయితే పరవాలేదు, మళ్ళీ నిలదొక్కుకోవచ్చు కానీ చాలామంది ముత్రులని, శ్రేయోభిలాషులను కోల్పోయాం. ఆరోగ్యమే మహాభాగ్యము అన్నారు కదా, అప్పుడు అనిపించింది ఈ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి నేను ఇండస్ట్రీ కి ఏమి చెయ్యగలను అని ఆలోచింఛా. అప్పుడే యోదా డయాగ్నసిస్ కి వెళ్ళినప్పుడు వాళ్ళతో మన సినిమా ఇండస్ట్రీ లో వున్న కార్మికుల ఆరోగ్యం గురించి ప్రస్తావించటం జరిగింది. యోదా డయాగ్నసిస్ చైర్మన్ కంచర్ల సుధాకర్ వెంటనే నా ఆలోచనని ఆమోదించి ముందుకు వచ్చారు. అయితే కొంతమంది మిత్రులు సభ్యుడు ఒక్కడికే కాకుండా, కుటుంబం లో వున్న రక్త సంభందీకులు అయిన మిగతా సభ్యులని కూడా కలిపితే బాగుంటుంది అని చెప్పారు. వెంటనే మళ్ళీ సుధాకర్ గారితో ప్రస్తావించటం జరిగింది, ఆయన కూడా వెంటనే సానుకూలంగా స్పందించి దానికి కూడా అంగీకారం తెలిపారు.. అంటూ చెప్పారు చిరంజీవి.

Advertisement

ఈ విధంగా చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చిరంజీవి గారు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో వున్న అన్ని క్రాఫ్ట్స్ లో వున్న సభ్యులందరికి ఈ కార్డులను అందచేశారు. ఈ కార్డు లో సభ్యుడి మొత్తం డేటా నే కాకుండా మరియు అతని కుటుంబ సభ్యుల డేటా కూడా పొందు పరచటం జరిగింది. ఇది అంతా డిజిటల్ ఫార్మాట్ లో చేసారు. దీని కోసం ఒక టీం ని పెట్టి ఒక సాఫ్ట్ వేర్ కూడా డెవలప్ చేసారు. ఇప్పటికే కొన్ని వేల కార్డులు రెడీ అయ్యాయి. ఇంకా మిగతా సభ్యుల డేటా అంతా కూడా ఫీడ్ చేస్తున్నారు. ఏ టెస్ట్ అయినా చేయించుకోవచ్చు, వీళ్ళు ఫిఫ్టీ శాతం మాత్రమే ఛార్జ్ చేస్తారు. ఇంకా కూడా తగ్గించడానికి ప్రయత్నిస్తున్నారు.

ఈ సందర్భంగా చిరంజీవి గారు మట్లాడుతూ.. తాను కళామతల్లి కి చెందిన వాడినని, అందువల్ల ఆ కళామతల్లి బిడ్డగా తన తమ్ముళ్ళకి, మిగతా సోదర సోదరీమణులకు తాను ఈ పని చేస్తున్నట్టు చెప్పారు. ఇండస్ట్రీ లో కార్మికుడికి ఏ కష్టం వచ్చినా, ఆ కళామతల్లి బిడ్డగా నేను వాళ్ళకి చేస్తున్నా. ఇది నా ధర్మం మరియు నా బాధ్యత. నా కుటుంబాన్ని నేను కాపాడుకోవడంలో భరోసాగా ఉండాలని నేను చెప్పాలనుకున్నా. నా కుంటుంబం లో అందరూ ఆరోగ్యంగా ఉండాలన్న భావనతో, వాళ్ళ కుటుంబ సభ్యుడిగా నేను చేస్తున్న పని ఇది, అంతే కానీ ఇది వేరే ఇంకే రకంగా చేస్తున్న పని కాదు అని చెప్పారు చిరంజీవి.

Chiranjeevi Distributed Yoda Diagnostics Lifetime Health Cards:

MegaStar Chiranjeevi Press Meet
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement