Advertisement
Google Ads BL

భీమ్లా నాయక్ ని లైట్ తీసుకున్నారుగా


సంక్రాంతి టార్గెట్ గా మొదలు పెట్టిన పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్.. పాన్ ఇండియా మూవీస్ తో పాటుగా ప్రమోషన్స్ లో అదరగొట్టేసింది. పవన్ కళ్యాణ్ - రానా కాంబోలో మొదలైన భీమ్లా నాయక్ మూవీ పై ట్రేడ్ లో విపరీతమైన అంచనాలున్నాయి. జనవరి 12 న భీమ్లా నాయక్ వస్తుంది.. మనకి కలిసొచ్చిన ఆ డేట్ లో అంటే జనవరి 12 న భీమ్లా నాయక్ తో భారీ హిట్ కొట్టడం ఖాయమంటూ భీమ్లా నాయక్ మేకర్స్ ఫుల్ స్వింగ్ లో ప్రమోషన్స్ మొదలు పెట్టారు. మధ్యలో ఆర్.ఆర్.ఆర్, రాధేశ్యామ్ మూవీ కి అడ్డం ఎందుకులే అని భీమ్లా నాయక్ సంక్రాంతి బరి నుండి తప్పుకుంది. అయితే ఇప్పుడు ఆర్.ఆర్.ఆర్ మూవీ వాయిదా పడడంతో.. మళ్ళీ భీమ్లా నాయక్ రిలీజ్ జనవరి 12 కి మారితే బావుంటుంది అని పవన్ ఫాన్స్ ఆశపడ్డారు. అలాగే మేకర్స్ కి రిక్వెస్ట్ చేస్తున్నారు. మన డేట్ కి వచ్చేద్దాం అని. మరి భీమ్లా నాయక్ మేకర్స్ ఏం ఆలోచిస్తున్నారో ఇంకా క్లారిటీ లేదు. అంటే సంక్రాంతికి వచ్చినా వచ్చెయ్యొచ్చు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న న్యూస్.

Advertisement
CJ Advs

అయితే ఇప్పుడు మీడియం బడ్జెట్, లో బడ్జెట్ మేకర్స్ భీమ్లా నాయక్ ని లైట్ తీసుకుంటున్నట్టుగా కనబడుతుంది. అందుకే ఈ పొంగల్ టార్గెట్ గా డెబ్యూ హీరోలు, యంగ్ హీరోస్ తమ సినిమాలని సంక్రాంతికి రిలీజ్ చెయ్యబోతున్నట్టుగా హడావిడిగా రిలీజ్ డేట్స్ ప్రకటిస్తున్నారు. వరసబెట్టి ఏడెనిమిది సినిమాలు పొంగల్ రేస్ లోకి వచ్చేసాయి. భీమ్లా నాయక్ రాదనే గ్యారెంటీ తో.. దిల్ రాజు రౌడీ బాయ్స్ ని, గల్లా అశోక్ హీరో మూవీ ని, అలాగే చిరు అల్లుడు కళ్యాణ్ దేవ్ సూపర్ మచ్చి, సుమంత్ అశ్విన్ 7 డేస్, 6 నైట్స్.. ఇలా చాలా సినిమాలు రిలీజ్ డేట్స్ తో పోటీ పడుతున్నాయి. మరి పవన్ భీమ్లా నాయక్ సంక్రాంతికే అంటే వీరంతా ఏమైపోతారవో పాపం. అయినా భీమ్లా నాయక్ వస్తే ఏంటి.. లేదంటే ఏంటి అన్నట్టుగా భీమ్లా నాయక్ ని లైట్ తీసుకుని రిలీజ్ డేట్స్ ఇవ్వడం క్రేజీగా మారింది. 

Bheemla Nayak was taken to the light:

Medium Budget films in Sankranthi 2022 Race
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs