Advertisement
Google Ads BL

RRR వాయిదా.. వాళ్ళు హ్యాపీ


రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ మూవీ ని ఓ రేంజ్ లో ప్రమోట్ చేసి.. బాక్సాఫీసుని షేక్ చేద్దామనుకుంటే.. కరోనా దెబ్బేసింది. వరల్డ్ వైడ్ గా థియేటర్స్ అక్కడక్కడా మూసివేయడంతో.. ఆర్.ఆర్.ఆర్ మూవీ రిలీజ్ చేసి చేతులు కాల్చుకోవడం ఎందుకు అని రాజమౌళి మరియు దానయ్యలు ఆ సినిమాని జనవరి 7నుండి పోస్ట్ పోన్ చేసారు. ఆర్.ఆర్.ఆర్ పోస్ట్ పోన్ అయినందుకు ఆర్.ఆర్.ఆర్ ఫాన్స్ చాలా వర్రీ అయ్యారు. ఇప్పటికి ఆ ఫీలింగ్ నుండి బయటికి రాలేకపోతున్నారు. ఎన్నో అంచనాలు పెట్టుకున్న ఆర్.ఆర్.ఆర్ వాయిదాతో బాధలో ఉండిపోయారు. కానీ ఆర్.ఆర్.ఆర్ వాయిదా వల్ల చాలామంది సంతోషపడుతున్నారు.

Advertisement
CJ Advs

అదే చిన్న సినిమాల నిర్మాతలు. పొంగల్ కి ఆర్.ఆర్.ఆర్, రాధేశ్యాం ఉంటే.. తమ సినిమాల విడుదల సాధ్యం కాదు. ఇప్పుడు ఆర్.ఆర్.ఆర్ పోస్ట్ పోన్ అవడంతో.. అలా మేకర్స్ ప్రకటించారో లేదో.. ఇలా చాలామంది మేకర్స్ తమ సినిమాలు సంక్రాంతికి రిలీజ్ అంటూ ప్రకటించేస్తున్నారు. ఇప్పటికే మహేష్ మేనళ్లుడు గల్లా అశోక్ హీరో మూవీ పొంగల్ రిలీజ్ అంటూ ఎనౌన్స్ చెయ్యగానే.. సిద్దు జొన్నలగడ్డ డీజే తిల్లు కూడా పొంగల్ కే అని డేట్ ఇచ్చారు. మరో పక్క చిరు చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ సూపర్ మచ్చి కూడా పొంగల్ రిలీజ్ అంటూ డేట్ అనౌన్స్ చేసారు. ఇక తమిళనాట అజిత్ కూడా వాలిమై మూవీ జనవరి 13 న రిలీజ్ చేయబోతున్నట్లుగా ప్రకటించారు. అలాగే నిర్మాత ఎం ఎస్ రాజు కొడుకు 7 డేస్, 6 నైట్స్ కూడా సంక్రాంతికే రిలీజ్ అని ప్రకటించారు. సో ఆర్.ఆర్.ఆర్ వాయిదా తో వీరంతా హ్యాపీ గా డేట్స్ అనౌన్స్ చేసేసారు. కొత్తగా దిల్ రాజు రౌడీ బాయ్స్ కూడా పొంగల్ కి రిలీజ్ అని.. డేట్ సూన్ అంటూ ప్రకటించారు.

RRR postponed, They are happy:

Pongal Release Movies 2022
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs