Advertisement
Google Ads BL

ఐ హేట్ కరోనా


కరోనా కరోనా కరోనా గత రెండేళ్లుగా ఇదే మాట ప్రజల నోట. డిసెంబర్ 2019 లో మొదలైన కరోనా మహమ్మారి 2022 వచ్చినా వదల్లేదు. ఇంతవరకు కరోనా తో చనిపోయిన వారిని చూసి చాలామంది కరోనా ని అస్యహించుకున్నవారు ఉన్నారు. కరోనాకి భయపడిన వారు ఉన్నారు. కానీ ఫస్ట్ టైం ఐ హేట్ కరోనా అంటూ చాలామంది మూవీ లవర్స్ నోటి వెంట పలుకుతున్న మాట. ఇంతవరకు కరోనా కారణంగా ఎన్ని సినిమాలు వాయిదా పడినా పెద్దగా ఫీల్ అవ్వని ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న ఆర్.ఆర్.ఆర్ పోస్ట్ పోన్ అనగానే అది కకూడా కరోనా కారణంగా అనగానే.. ఆర్.ఆర్.ఆర్ ఫాన్స్ అంతా ముక్తఖంటంతో ఐ హేట్ కరోనా అంటూ కరోనాని తిట్టి పోస్తున్నారు.

Advertisement
CJ Advs

రాజమౌళి లా ఏ దర్శకుడు కష్టపడి ఉండరు. అంతలా కష్టపడిన రాజమౌళిని కరోనా మోసం చేసింది. హీరోలిద్దరూ ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్, నిర్మాత దానయ్య, రాజమౌళి లు ఓ నెల రోజులుగా ఇళ్ళకి, ఫామిలీస్ కి దూరమై ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్స్ తో కష్టపడుతున్న వాళ్ళని చూసి కరోనా కనికరించలేదు. అంతా అయ్యి రిలీజ్ అనుకుంటున్న టైం లో థర్డ్ వేవ్ కరోనా ఆర్.ఆర్.ఆర్ మూవీ ఆగిపోయేలా చేసింది. ఏడాది కాలంగా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురు చూసింది ఒక ఎత్తు.. గత నెలలో ఆర్.ఆర్.ఆర్ ట్రైలర్ తర్వాత సినిమాని ఎప్పుడు చూసెయ్యాలా అని అతృతతో ఉన్నది ఒక ఎత్తు. కానీ ఇలా పోస్ట్ పోన్ అవడంతో అందరూ ఉసూరుమన్నారు.

రాజమౌళి కష్టపడి సినిమా తియ్యడం అటుంచి.. ప్రమోషన్స్ విషయంలో ఎంతో హైప్ క్రియేట్ చేసి వదిలిన సినిమా అర్ధాంతరంగా ఆగింది. మళ్ళీ రిలీజ్ టైం కి ఇంత ప్రమోషన్ చెయ్యాలంటే మాములు విషయం కాదు. అందుకే ఆర్.ఆర్.ఆర్ అభిమానులు ఐ హేట్ కరోనా అంటూ తెగ ఫీలైపోతున్నారు. 

I Hate Corona :

Omicron shock: RRR postponed indefinitel
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs